logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

కోవిడ్ చికిత్సకు కొత్త మందు.. ఆమోదించిన డీసీజీఐ, ఒక్క డోసుతో కరోనా ఆటకట్టు

భారత్ లో కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడో వార్త భారీ ఊరటనిస్తోంది. కరోనా కట్టడికి కొత్త ఔషధం అందుబాటులోకి రానుంది. జైడస్ క్యాడిలా రూపొందించిన విరాఫిన్ కు భారత ఔషధ నియంత్రణా మండలి (డీసీజీఐ) అత్యవసర ఆమోదం లభించింది. ప్రస్తుతం మన దేశంలో సీరం ఉత్పత్తి చేస్తున్న ఆస్ట్రాజెనికా- ఆక్స్ ఫర్డ్ వాక్సిన్ కోవిషీల్డ్, భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్ అనే రెండు వాక్సిన్ లు అందుబాటులో ఉండగా ఇటీవలే రష్యా స్పుత్నిక్ వి వాక్సిన్ కు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది.

తాజాగా హైపటైటిస్ చికిత్సలో ఉపయోగించే విరాఫిన్ అనే యాంటీ వైరల్ కు చెందిన ఔషదానికి మన దేశంలో అత్యవసర ఆమోదం లభించింది. హైపటైటిస్ బి, సి రోగుల చికిత్సలో విరాఫిన్ ను చాలా కాలంగా వినియోగిస్తున్నారు. ఈ మందు కోవిడ్ చికిత్సలో కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నట్టుగా జైడస్ క్యాడిలా సంస్థ పేర్కొంది. ఒక్క డోసుతోనే కరోనా వైరస్ తీవ్రతను తగ్గిస్తున్నటుగా క్లినికల్ ట్రయల్స్ లో వెల్లడైంది.

ట్రయల్స్ లో భాగంగా వైరస్ సోకిన వారికి విరాఫిన్ తో చికిత్స చేస్తే 7 వ రోజే వారికి కరోనా నెగిటివ్ గా తేలిందని సంస్థ పేర్కొంది. ఈ విధంగా 91. 15 శాతం మంది 7 రోజుల్లోనే కోలుకున్నారని తెలిపింది. వైరస్ సోకిన మొదట్లోనే ఈ ఔషధాన్ని తీసుకున్నవారిలో ఆక్సిజన్ అందించాల్సిన అవసరం ఏర్పడదని, అలాగే పరిస్థితి విషమించే ప్రమాదం ఉండదని తెలిపింది. కరోనాతో పాటుగా ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లను కూడా అరికట్టి సమర్థవంతంగా పనిచేసిందని కంపెనీ తెలిపింది.

మన శరీరంలో ఉండే టైప్ -1 ఇంటర్ ఫెరాన్స్ కరోనా లాంటి వైరస్ లను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వయస్సుతో పాటుగా శరీరంలో వీటి సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. దీంతో వ్యాధులను తట్టుకుని నిలబడే శక్తిని శరీరం కోల్పోతుంది. ప్రస్తుతం వయస్సు పైబడిన వారిలో కరోనా తీవ్రంగా ఉండటానికి కారణం ఇదే. ఇలాంటి నేపథ్యంలో విరాఫిన్ వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుందని క్యాడిలా హెల్త్ కేర్ సంస్థ ధీమా వ్యక్తం చేస్తుంది.

Related News