logo

  BREAKING NEWS

బీజేపీ పార్టీలోకి తెలంగాణ ఫైర్ బ్రాండ్?… క్లారిటీ వచ్చేసింది!  |   మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్: చరిత్ర మరువని రియల్ హీరో స్టోరీ!  |   8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |  

వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగుల్లో కొత్త వ్యాధి!.. ‘జూమ్ డిస్మోర్ఫియా’ అంటే ఏమిటి?

కరోనా దెబ్బకు ప్రజల జీవితాల్లో కనీవినీ ఎరుగని మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మహమ్మారి కారణంగా సాఫ్ట్ వేర్ కంపెనీలన్నీ ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయాలంటూ ఆదేశించాయి. మిగిలిన సంస్థలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. లాక్ డౌన్ సడలింపుల తర్వాత కూడా సెకండ్ వేవ్ భయపెడుతోంది. దీంతో కొన్ని సంస్థలు శాశ్వతంగా ఉద్యోగులను ఇంటికే పరిమితం చేసాయి. ఆఫీసు మెయింటెనెన్స్ ఖర్చులను ఆదా చేయడానికి కూడా సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలని ఆదేశిస్తున్నాయి. దీంతో ఇంటి నుంచి పని చేసే ఉద్యోగులను ఇపుడు కొత్త రకం వ్యాధి వేధిస్తుంది.

కొన్ని రోజుల కిందటి వరకు ఇంటి నుంచి పని చేయడానికి ఎంతో ఉత్సాహం చూపించే ఉద్యోగులు ఇప్పుడు ఇంటి నుంచి పని అంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఆఫీసు పనిలో భాగంగా ఉద్యోగులు తమ పై అధికారులు, క్లయింట్లు, తోటి ఉద్యోగులతో వీడియో కఫరెన్స్ ద్వారా మాట్లాడుకోవలసి ఉంటుంది. ఇపుడు ఇదే వారి పాలిట శాపమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇంటి నుంచి పని చేసే ఉద్యోగుల్లో ‘జూమ్ డిస్మోర్ఫియా’ అనే వ్యాధి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు.

ఇన్నాళ్లు ఆఫీసుకు వచ్చి పని చేస్తున్న సమయంలో తమ రూపు రేఖల్ని అంతగా పట్టించుకోని ఉద్యోగులు.. వీడియో సమావేశాల్లో మాట్లాడేటప్పుడు రోజు తమ ముఖాల్ని చూసుకోవాల్సి వస్తుంది. అలా వారి ముఖం, శరీరంలో ఉన్న లోపాలు స్పష్టంగా కనిపిస్తుండటం గుర్తిస్తున్నారట. దీంతో ఆత్మన్యూనతా భావానికి లోనవుతున్నారు. ఈ సమస్య వారి ఏకాగ్రతను దెబ్బతీయడమే కాకుండా మానసిక సమస్యలకు కారణమవుతుంది. ఈ మధ్య కాలంలో గూగుల్ లో యాక్నే, హెయిర్ లాస్, ఇతర సౌందర్య ఉత్పత్తుల గురించి సెర్చ్ చేస్తున్నారని తేలింది.

ఇది జూమ్ డిస్మోర్ఫియా వ్యాధి విస్తరిస్తుందని చెప్పడానికి ఒక ఉదాహరణగా చెప్తున్నారు. దీంతో ఉద్యోగులంతా ముఖంలోని లోపాలను సరి చేసుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీల కోసం పరుగులు పెడుతున్నారు. అందంగా కనిపించడానికి వారు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తున్న ఉద్యోగులపై అమెరికాకు చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

Related News