logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

జోమా‌టోపై క‌రోనా దెబ్బ‌… భారీగా ఉద్యోగాలు ఊస్ట్‌

క‌రోనా వైర‌స్ కార‌ణంగా వ్యాపారాలు పూర్తిగా నిలిచిపోవ‌డంతో పెద్ద పెద్ద కంపెనీలు కూడా న‌ష్టాలు చ‌వి చూస్తున్నాయి. దీంతో ఖ‌ర్చు త‌గ్గించుకోవ‌డానికి ఆయా కంపెనీలు ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్నాయి. తాజాగా ప్ర‌ముఖ ఫుడ్ డెలివ‌రీ యాప్ జోమాటోపై కూడా క‌రోనా వైర‌స్ దెబ్బ ప‌డింది. దీంతో న‌ష్టాల‌ను పూడ్చుకునేందుకు ఉద్యోగుల సంఖ్య త‌గ్గించాల‌ని ఆ సంస్థ నిర్ణ‌యించింది. ఈ మేర‌కు 13 శాతం ఉద్యోగుల‌ను తొల‌గించాల‌ని నిర్ణ‌యించింది.

ఈ విష‌యాన్ని జోమాటో వ్య‌వ‌స్థాప‌కుడు, సీఈఓ దీపేంద‌ర్ గోయ‌ల్ ఉద్యోగుల‌కు రాసిన లేఖ‌లో ప్ర‌క‌టించారు. అయితే, తొల‌గించిన జాబితాలో ఉన్న ఉద్యోగుల‌కు 24 గంట‌ల్లో తెలియ‌జేస్తామ‌ని చెప్ప‌డంతో త‌మ ఉద్యోగం ఉందో, లేదోన‌ని ఉద్యోగుల్లో ఆందోళ‌న నెల‌కొంది. కాగా, ఉద్యోగంలో నుంచి తీసేసిన వారికి ఆరు నెల‌ల పాటు స‌గం జీతం ఇవ్వాల‌ని, కంపెనీ ఇప్పించిన ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌ల‌ను తిరిగి తీసుకోవ‌ద్ద‌ని జోమాటో యాజ‌మాన్యం నిర్ణ‌యించింది.

Related News