logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

ఏపీ ప్రజలకు ‘సున్నా వడ్డీ కానుక’.. వారి ఖాతాల్లోకి నగదు జమ!

అకాల వర్షాల కారణంగా భారీగా నష్టపోయిన సన్న, చిన్నకారు రైతులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి ‘వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు’ పథకాన్ని వర్చువల్ కార్యక్రమం ద్వారా ప్రారంభించారు. 2019 ఖరీఫ్ సీజన్‌కు గాను సకాలంలో పంట రుణాలను చెల్లించిన 14.58 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి వడ్డీ, రాయితీ డబ్బులను జమ చేసారు.

ఈ మేరకు రూ. 510 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. వీరితో పాటుగా అక్టోబర్ నెలలో వర్షాల కారణంగా పంట నష్టపోయిన వ్యవసాయ, ఉద్యానవన రైతులకూ ఇన్ ఫుట్ సబ్సిడీ కింద రూ. 132 కోట్లను అందించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్దమాట్లాడుతూ.. రైతులకు ఎంత చేసినా అది తక్కువే అన్నారు. అర్హులైన ప్రతి ఒక్క రైతుకు సున్నా వడ్డీ రాయితీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ డబ్బు రైతన్నల ఖాతాల్లోకి నేరుగా జమ అవుతుందన్నారు. పంట నష్టపోయిన సీజన్ లోనే రైతులకు నష్టపరిహారం అందించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు గత అక్టోబర్ నెలలో అందుకు సంబందించిన వివరాలను అధికారులు అంచనా వేసి ముఖ్యమంత్రికి అందించగా నెల రోజుల వ్యవధిలోనే నష్టపరిహారాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేసారు.

Related News