logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

కరోనాపై న్యూజిలాండ్ విజయం.. జీరో కేసులు.. కారణాలివే!

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ను న్యూజిలాండ్ దేశం జయించింది. ఒక్క పాజిటివ్ కేసు కూడా లేని దేశంగా న్యూజిలాండ్ నిలిచింది. న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ కు చెందిన సెయింట్ మార్గరెట్ అనే మహిళకు కరోనా సోకగా ఇటీవల ఆమె కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యిందని ఆ దేశ ప్రధాని జసిండా అర్డెర్న్ ప్రకటించారు. దీంతో ఆ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా లేకపోవడంతో జీరో కోవిడ్ కేసుల దేశాల జాబితాలో న్యూజిలాండ్ నిలిచింది.

దీంతో ఆ దేశ ప్రజలు చప్పట్లతో ఆ మహిళకు స్వాగతం పలికారు. దేశమంతా సంబరాలు జరుపుకున్నారు. న్యూజిలాండ్ లో మొత్తం 1500 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 20 మంది మరణించారు. కరోనా లాక్ డౌన్ కారణంగా దేశంలో ఆర్థికంగా చితికిపోయిన దేశాలలో న్యూజిలాండ్ కూడా ఒకటి. 5 మిలియన్ల జనాభా గల దేశంలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయడం వలెనే ఈ విజయం సాధించామన్నారు.

ఈ విజయంలో ఆ దేశ ప్రధాని కీలక పాత్ర పోషించారు. గతంలో భూకంపం వచ్చినా బెదరకుండా ఆమె ఓ టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూను కొనసాగించి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. మాస్క్ లకు కట్టుకుంటూ..భౌతిక దూరం పాటిస్తే ఎటువంటి మేలు జరుగుతుందో కరోనాను ఎంత త్వరగా తరమివేయగలమో అనే విషయంపై మీడియా ద్వారా ప్రజల్ని చైతన్య పరిచారు. ప్రజలు కూడా తూచా తప్పకుండా నిబంధనలను పాటించడంతో ఈ విజయం సాధ్యమైంది. గడిచిన కొన్ని రోజులుగా అక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాలేదంటే అక్కడి ప్రజలు ఎంత జాగ్రత్తగా మెలుగుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

దేశం ఆర్థిక మాంద్యంలోకి కూరుకుపోతున్నా ఆ దేశ ప్రధాని జసిండా అర్డెర్న్ కరోనాను దేశం నుండి తరిమేయ్యడమే ముఖ్యమని భావించామన్నారు. అందుకు దేశవ్యాప్తంగా కరోనా నివారణ చర్యలు చేపట్టామని నిత్యావసర, అత్యవసర వస్తువులకు మాత్రమే ప్రజలు బయటకు రావాలని ఆంక్షలు విధించారు. అవన్నీ సత్ఫాలితాల్ని ఇవ్వడంతో నేడు దేశమంతా ప్రజలు సంబరాల్లో మునిగితేలుతున్నారు.

Related News