ఏపీలో వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారం చెల్లింపును సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. పంట నష్టపోయిన రైతులకు ఈ పథకం ద్వారా రూ. 1,252 కోట్ల బీమా పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించనుంది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. ఈ పథకం కింద మొత్తం 9.48 లక్షల రైతులకు లబ్ది చేకూరనుంది సీఎం వివరించారు. ఈ మొత్తాన్ని రైతుల ఖాతాలో నేరుగా జమ చేస్తుందని అన్నారు. గతంలో పంటల భీమా ఎవరికి అందేదో తెలిసేది కాదన్నారు. ఇన్స్యురెన్ వస్తుందనే నమ్మకం కూడా రైతుల్లో ఉండేది కాదు.
పంట నష్టం జరిగితే బీమా సొమ్ము వస్తుందనే నమ్మకం రైతుల్లో కలగాలని జగన్ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద రైతులందరికీ బీమాపై భరోసా కల్పించామన్నారు. గతంలో రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రీమియం కట్టేవి. ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వమే రైతుల తరపున ఇన్స్యూరెన్స్ ప్రీమియం చెల్లిస్తుందన్నారు. రైతు ప్రీమియం వాటా రూ. 465 కోట్లు ప్రభుత్వమే చెల్లించిందన్నారు.