logo

  BREAKING NEWS

సుప్రీం తీర్పు: అధికారులతో సీఎం జగన్ అత్యవసర సమావేశం!  |   పంచాయతీ ఎన్నికలు.. ఉద్యోగ సంఘాలకు నిమ్మగడ్డ షాక్!  |   బ్రేకింగ్: ఎన్నికలపై సుప్రీం తీర్పు: నిమ్మగడ్డ సంచలన నిర్ణయం!  |   బిగ్ బ్రేకింగ్: ఏపీ పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కీలక తీర్పు!  |   సిక్కిం సరిహద్దుల్లో చైనా దుస్సాహసం.. బుద్ధి చెప్పిన సైనికులు  |   చింత‌గింజ‌ల‌తో మోకాళ్ల నొప్పుల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం‌  |   పాత రూ. 100, రూ.10, రూ.5 కరెన్సీ నోట్లు ఇకపై చెల్లవా.. నిజమెంత?  |   మాజీ మంత్రి జానారెడ్డికి ఊహించని షాక్.. బీజేపీ ప్లాన్ లో భాగమేనా?  |   వీడని ఉత్కంఠ.. పంచాయతీ ఎన్నికలపై మరో ట్విస్ట్..!  |   బ్రేకింగ్: వికటించిన కరోనా టీకా.. ఆశా కార్యకర్త బ్రెయిన్ డెడ్!  |  

రెండు ఎమ్మెల్సీ స్థానాల‌కు వైసీపీ అభ్య‌ర్థులు వీరే..!

ఇటీవ‌ల క‌రోనా బారిన ప‌డి క‌న్నుమూసిన ఎమ్మెల్సీ చ‌ల్లా రామ‌కృష్ణారెడ్డి కుటుంబాన్ని ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌రామ‌ర్శించారు. ఇవాళ ఆయ‌న గ‌న్న‌వ‌రం నుంచి క‌ర్నూలు వెళ్లి అవుకులోని చ‌ల్లా ఇంటికి వెళ్లి ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌ను ఓదార్చారు. ఈ సంద‌ర్భంగా చ‌ల్లా రామ‌కృష్ణారెడ్డి కుమారుడు భ‌గీర‌థ‌రెడ్డితో సుమారు అర‌గంట పాటు జ‌గ‌న్ మాట్లాడారు.

చ‌ల్లా రామ‌కృష్ణారెడ్డి ఏడాది క్రిత‌మే ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు ఆయ‌న మ‌ర‌ణంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని ఆయ‌న కుమారుడు భ‌గీర‌థ రెడ్డికి ఇస్తాన‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు. ఇక‌, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే.

ఆమె రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం ఉప‌ ఎన్నిక‌కు నోటీఫికేష‌న్ విడుద‌లైంది. ఈ నెల‌ 18వ తేదీన ఈ ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఈ స్థానం నుంచి పోతుల సునీత‌ను పోటీ చేయించి ఆమె స్థానాన్ని ఆమెకే కేటాయించాల‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. ఇంత‌క‌ముందు కూడా డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్ విష‌యంలోనూ జ‌గ‌న్ ఇదే నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

Related News