logo

  BREAKING NEWS

ప్ర‌ముఖ న్యూస్ ఛాన‌ల్ ఆఫీస్‌పై దాడి  |   ఉద్యోగం పోయిందా..? కేంద్రం ఆర్థిక సాయం చేస్తుంది..!  |   ఢిల్లీకి అమ‌రావ‌తి మ‌హిళ‌లు.. జ‌గ‌న్ స‌ర్కార్‌‌పై ఒత్తిడి తెచ్చే వ్యూహం  |   మెడ‌నొప్పి బాధిస్తోందా..? ఈ చిట్కాలు పాటించండి.. 15 రోజుల్లో త‌గ్గిపోతుంది  |   చైనాలో మొద‌లైన‌ మ‌రో జ‌బ్బు.. ఇది సోకితే పిల్ల‌లు పుట్ట‌రు‌  |   టీటీడీ నిర్ణ‌యం అనాచారం.. అరిష్ఠం.. అధ్యాత్మిక ద్రోహం  |   IPL 2020: ఎక్కువ డ‌బ్బులు సంపాదించే టాప్ 10 క్రికెట‌ర్స్ వీళ్లే  |   బ్రేకింగ్‌: వైసీపీలోకి మ‌రో టీడీపీ ఎమ్మెల్యే.. నేడే చేరిక‌..!  |   న‌ల్గొండ‌ ఎస్పీకి షాక్ ఇచ్చిన సైబ‌ర్ నేర‌గాళ్లు  |   ఒంట్లో నీరు తగ్గాలంటే ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు  |  

ఢిల్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీల ధ‌ర్నా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్ల‌మెంటులో ధ‌ర్నాకు దిగారు. అమ‌రావ‌తి భూకుంభ‌కోణం, ఫైబ‌ర్ గ్రిడ్ స్కామ్‌పై సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌నే డిమాండ్‌తో పార్ల‌మెంటు గాంధీ విగ్ర‌హం ముందు వైసీపీ ఎంపీలు ప్లకార్డుల‌తో ధ‌ర్నా చేశారు. ఈ రెండు అంశాల‌కు సంబంధించి సీబీఐ విచార‌ణ కోసం పార్ల‌మెంటులో పోరాడాల‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వైసీపీ ఎంపీల‌ను ఆదేశించిన సంగ‌తి తెలిసిందే.

ఈ మేర‌కు నిన్న లోక్‌స‌భ‌లో ఈ విష‌యాన్ని వైసీపీ లోక్‌స‌భాప‌క్ష నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లేవ‌నెత్తారు. అమ‌రావ‌తి భూముల వ్య‌వ‌హారం, ఫైబ‌ర్‌గ్రిడ్‌లో భారీ కుంభ‌కోణాలు జ‌రిగాయ‌ని, వీటిపైన సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. కాగా, అమ‌రావ‌తి భూముల వ్య‌వ‌హారానికి సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం వేసిన సిట్ త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకోకుండా హైకోర్టు స్టే ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

ఈ రెండు అంశాల్లో క‌చ్చితంగా అక్ర‌మాలు జ‌ర‌గాయ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ అంశాల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోని సంస్థ‌తో విచార‌ణ జ‌రిపిస్తే టీడీపీ నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. విచార‌ణ నిష్ప‌క్ష‌పాతంగా జర‌గ‌లేద‌ని, ప్ర‌భుత్వం త‌ప్పుడు కేసులు పెట్టింద‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తాయి. అందుకే ఈ రెండు వ్య‌వ‌హారాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప‌రిధిలో ఉండే సీబీఐ ద్వారా విచార‌ణ జ‌రిపితేనే బాగుంటుంద‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది.

Related News