logo

  BREAKING NEWS

మాజీ మంత్రి అఖిల ప్రియ కేసులో కొత్త మలుపు!  |   నువ్వు దేవుడివి సామీ.. 1020 మంది చిన్నారుల‌కు ప్రాణాలు పోసిన మ‌హేష్  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌ను టెన్ష‌న్ పెడుతున్న త్రివిక్ర‌మ్‌  |   తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |  

ఎమ్మెల్యేకు క‌రోనా.. ఏపీ అసెంబ్లీలో కోవిడ్ క‌ల‌వ‌రం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్న వేళ క‌రోనా క‌ల‌క‌లం సృష్టించింది. నిన్న అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రై ప్ర‌సంగించిన ఓ ఎమ్మెల్యేకు ఇవాళ క‌రోనా నిర్ధార‌ణ అయ్యింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన త‌ణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వ‌ర‌రావు నిన్న అసెంబ్లీకి హాజ‌రయ్యారు. టిడ్కో ఇళ్ల‌పై జ‌రిగిన చ‌ర్చ‌లో ఆయ‌న ప్ర‌సంగించారు.

రెండు రోజుల క్రితం ఆయ‌న క‌రోనా ప‌రీక్ష చేయించుకోగా నిన్న రాత్రి రిపోర్టు వ‌చ్చింది. ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటీవ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. దీంతో ఆయ‌న హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ప్ర‌స్తుతం కారుమూరి నాగేశ్వ‌ర‌రావుకు ఆరోగ్యం బాగానే ఉంది. అయితే, నిన్న అసెంబ్లీలో ఆయ‌న ప‌లువురు ఎమ్మెల్యేలు, మంత్రులను క‌లవ‌డంతో ఇప్పుడు వారంతా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోనున్నారు. ప్ర‌స్తుతం అసెంబ్లీ స‌జావుగానే సాగుతోంది.

Related News