logo

  BREAKING NEWS

క‌రోనా సెకండ్ వేవ్ అంటే ఏంటి ? మ‌న ద‌గ్గ‌ర ఎప్పుడు మొద‌ల‌వుతుంది ?  |   మీ ఫోన్‌లో ఈ 21 యాప్‌లు ఉన్నాయా ? ‌వెంట‌నే డిలీట్ చేసేయండి !  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు ?  |   క‌రోనా ప‌రీక్ష‌ల‌కు కొత్త విధానం.. ఇక క‌రోనా టెస్టులు సులువు, చౌక‌  |   క‌రోనా వ్యాక్సిన్ కావాలంటే బీజేపీకే ఓటేయాలా ?  |   గుడ్ న్యూస్: వ్యాక్సిన్ రిలీజ్ డేట్ చెప్పేసిన భార‌త్ బ‌యోటెక్‌  |   మీ పిల్ల‌ల‌కు ఉచితంగా కార్పొరేట్ స్థాయి హాస్ట‌ల్‌తో కూడిన‌ విద్య కావాలా  |   RRR టీజ‌ర్ కాపీ కొట్టారా..? ప్రూఫ్స్ చూపిస్తున్న నెటిజ‌న్లు  |   ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |  

రోజా ఎంట్రీతో జీ తెలుగుపై జ‌గ‌న్ అభిమానుల కోపం చ‌ల్లారింది

ఇటీవ‌ల జీ తెలుగు ఛాన‌ల్ ప‌ట్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అభిమానులు ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేశారు. త‌మ నాయ‌కుడిని అవ‌మానించేలా ఒక స్కిట్ వేయ‌డంతో జ‌గ‌న్ అభిమానుల‌కు జీ తెలుగుపైన ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా జీ తెలుగును బ్యాన్ చేయాల‌ని పిలుపునిస్తున్నారు. అయితే, ఇప్పుడు ఉన్న‌ట్లుండి జీ తెలుగుపై జ‌గ‌న్ అభిమానుల కోపం చ‌ల్లారింది. వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎంట్రీతోనే ఇది జ‌రిగింది.

జ‌న‌సేన నాయ‌కుడు నాగ‌బాబు ఆధ్వ‌ర్యంలో జీ తెలుగు ఛాన‌ల్‌లో అదిరింది అనే షో న‌డుస్తుంది. ఈ షోలో ఇటీవ‌ల గ‌ల్లీ బాయ్స్ అనే టీమ్ ఒక స్కిట్ వేసింది. రియాజ్ అనే యాక్ట‌ర్ జ‌గ‌న్‌ను ఇమిటేట్ చేశాడు. అన్న వ‌స్తున్నాడు అనే జ‌గ‌న్ డైలాగ్ కొడుతూ, చేతులు ఊపుతూ రియాజ్ వ‌స్తుంటే మిగ‌తా టీమ్ మెంబ‌ర్స్ పారిపోతుంటారు. వాళ్లు చేసిన ఈ స్కిట్ ప‌ట్ల జ‌గ‌న్ అభిమానులు హ‌ర్ట్ అయ్యారు.

త‌మ నాయ‌కుడిని, ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న జ‌గ‌న్‌ను కించ‌ప‌రిచార‌ని భావించారు. దీంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ స్కిట్ చేసిన యాక్ట‌ర్లు, ఈ స్కిట్ చూసి ప‌డి ప‌డి న‌వ్విన యాంక‌ర్ శ్రీముఖి, గెస్ట్‌ల‌పై త‌మ కోపాన్ని చూపించారు. కొంద‌రైతే వీరిని బండ‌బూతులు తిడుతూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టారు. జ‌గ‌న్ అభిమానులు హ‌ర్ట్ అయ్యార‌ని తెలియ‌గానే యాక్ట‌ర్ రియాజ్‌, అదిరింది టీమ్ క్ష‌మాప‌ణ‌లు కోరింది. మ‌రోసారి ఇలా జ‌ర‌గ‌ద‌ని, తాము కూడా జ‌గ‌న్ అభిమానుల‌మే అని చెప్పారు.

దీంతో వీరిపై జ‌గ‌న్ అభిమానులు కొంత శాంతించారు. కానీ, అదిరింది షో అన్నీ తానై నిర్వ‌హించే జ‌న‌సేన నాయ‌కుడు నాగ‌బాబు కావాల‌నే జ‌గ‌న్‌ను కించ‌ప‌రిచేలా ఇలాంటి స్కిట్‌లు వేయిస్తున్నార‌ని జ‌గ‌న్ అభిమానులు భావించారు. దీనికితోడు నాగ‌బాబు వీరి కోపం మ‌రింత పెరిగేలా ట్విట్ట‌ర్‌లో పోస్టులు పెట్టారు. దీంతో జ‌గ‌న్ అభిమానులు నాగ‌బాబుపై, జీ తెలుగు ఛాన‌ల్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. బాయ్‌కాట్ జీ తెలుగు పెరుతో సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్ట‌డం ప్రారంభించారు.

అయితే, ఇప్పుడు మాత్రం జీ తెలుగుపై జ‌గ‌న్ అభిమానుల కోపం ఒక్క‌సారిగా చ‌ల్లారింది. జీ తెలుగు సేవాభావ‌మే ఇందుకు కార‌ణం. కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్సిబులిటీ కింద జీ తెలుగు వాళ్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి 10 ఆంబులెన్స్‌లు, నాలుగు వేల పీపీఈ కిట్ల‌ను విరాళంగా ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రి పేర్ని నాని, వైసీపీ ఎమ్మెల్యే రోజా హాజ‌ర‌య్యారు.

ఏపీ ప్ర‌భుత్వానికి పెద్ద ఎత్తున విరాళం ఇచ్చినందున జీ తెలుగు గౌర‌వంగా సారీ చెప్పిన‌ట్లుగా జ‌గ‌న్ అభిమానులు భావిస్తున్నారు. దీంతో వీరు జీ తెలుగును టార్గెట్ చేయ‌డం మానేశారు. అయితే, యాదృచ్ఛికంగానే ఇప్పుడు జీ తెలుగు ఈ విరాళాన్ని ఇచ్చిందా లేదా జ‌గ‌న్ అభిమానుల కోపం చ‌ల్లార‌నే ఆలోచ‌న‌తో ఇచ్చిందా అనేది తెలియాల్సి ఉంది. ఎమ్మెల్యే రోజానే జీ తెలుగు వారికి ఈ ఐడియా ఇచ్చింద‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ఏదేమైనా జీ తెలుగు మాత్రం క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌కుండానే జ‌గ‌న్ అభిమానుల కోపాన్ని త‌గ్గించ‌గ‌లిగింది.

Related News