logo

  BREAKING NEWS

తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |   జ‌గ‌న్‌ను ఓడించే కుట్ర‌..? కొడాలి నాని పాత్ర‌..?  |   బ్రేకింగ్‌: జ‌గ‌న్ ఇంటి ముట్ట‌డి.. హైద‌రాబాద్‌, తిరుప‌తిలో ఉద్రిక్త‌త‌‌  |   బ్రేకింగ్: డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో మ‌హేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌త పేరు  |   అమెరికా నుంచి ఎలా వ‌చ్చింది..? ‘కాంగ్రెస్ గ‌డ్డి’ అని ఎందుకు పిలుస్తారు ?  |   తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్య‌క్షుడి పేరు ఖ‌రారు  |   ఇక నుంచి ‘యాదాద్రి’ రైల్వే స్టేష‌న్‌  |   హ‌రీష్ రావు వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్‌రావు  |   ఈ చిన్న ప‌ని చేస్తే 15 నిమిషాల్లో త‌ల‌నొప్పి మాయం  |   రూ.15,000 లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే  |  

మ‌ళ్లీ ఎన్‌డీఏకు జై కొట్టిన జ‌గ‌న్‌

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మ‌ళ్లీ ఎన్‌డీఏకు జై కొట్టింది. కేంద్రంతో స‌ఖ్య‌త‌గా ఉంటూ కీల‌క‌మైన బిల్లుల‌కు మ‌ద్ద‌తు ఇస్తూ వ‌స్తున్న వైసీపీ ఇప్పుడు రాజ్య‌స‌భ ఉపాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఎన్‌డీఏ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇచ్చారు. ఎన్‌డీఏ త‌ర‌పున పోటీ చేస్తున్న జేడీయూ ఎంపీ హ‌రివంశ్ నారాయ‌ణ్ సింగ్‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించింది.

రాజ్య‌స‌భ ఉపాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో యూపీఏ కూడా అభ్య‌ర్థిని బ‌రిలో నిలిపింది. రాజ్య‌స‌భ‌లో బీజేపీకి పూర్తి స్థాయిలో బ‌లం లేనందున ఈ ఎన్నిక‌లో గెల‌వ‌డానికి త‌ట‌స్థంగా ఉండే పార్టీల మ‌ద్ద‌తు కోరింది. త‌మ పార్టీ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇవ్వాలని బిహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఫోన్ చేసి కోరారు.

దీంతో ఎన్‌డీఏకే మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. కాగా, టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ ఎన్నిక‌ల్లో పాల్గొన‌వ‌ద్ద‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. అటు ఎన్డీఏకు, ఇటు యూపీఏకు స‌మాన‌దూరం మెయిన్‌టైన్ చేస్తున్న టీఆర్ఎస్ ఇద్ద‌రికీ మ‌ద్ద‌తు ఇవ్వొద్ద‌ని నిర్ణ‌యించింది. ఇక‌, తెలుగుదేశం పార్టీ మాత్రం ఇంకా ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేదు.

Related News