logo

  BREAKING NEWS

ప‌ద్మ‌విభూష‌ణ్‌, ప‌ద్మ‌భూష‌ణ్‌, ప‌ద్మ‌శ్రీ అవార్డుల‌తో ఎంత డ‌బ్బు ఇస్తారో తెలుసా ?  |   హింసాత్మకంగా మారిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ  |   ఏపీ పంచాయతీ వార్: జగన్ సర్కార్ ఆదేశాలకు ఎస్ఈసీ నో..!  |   తెలంగాణలో కొత్త పార్టీ.. క్లారిటీ ఇచ్చిన వైఎస్ షర్మిల!  |   సుప్రీం తీర్పు: అధికారులతో సీఎం జగన్ అత్యవసర సమావేశం!  |   పంచాయతీ ఎన్నికలు.. ఉద్యోగ సంఘాలకు నిమ్మగడ్డ షాక్!  |   బ్రేకింగ్: ఎన్నికలపై సుప్రీం తీర్పు: నిమ్మగడ్డ సంచలన నిర్ణయం!  |   బిగ్ బ్రేకింగ్: ఏపీ పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కీలక తీర్పు!  |   సిక్కిం సరిహద్దుల్లో చైనా దుస్సాహసం.. బుద్ధి చెప్పిన సైనికులు  |   చింత‌గింజ‌ల‌తో మోకాళ్ల నొప్పుల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం‌  |  

ఆప‌ద‌లో అండ‌గా ఉండే వైఎస్సార్ బీమా.. ఇలా న‌మోదు చేసుకోవాలి..!

ఒక పేద‌ వ్య‌క్తి శాశ్వ‌త వైక‌ల్యం పొందినా మ‌ర‌ణించిన ఆ వ్య‌క్తిపై ఆధార‌ప‌డిన కుటుంబ‌మంతా ఇబ్బందుల్లో ప‌డిపోతుంది. కుటుంబాన్ని పోషించే వ్య‌క్తి మంచానికే ప‌రిమిత‌మైతే, మ‌ర‌ణిస్తే ఆ కుటుంబం ఎదుర్కునే ఆర్థిక ఇబ్బందులు అన్నీఇన్నీకావు. ఇటువంటి వారికి అండ‌గా నిలిచేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఒక మంచి ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంది. వైఎస్సార్ బీమా పేరుతో చేప‌ట్టిన ప‌థ‌కం ఆప‌ద‌లో ఉన్న పేద‌ల‌కు అండ‌గా నిలుస్తోంది.

బియ్యం కార్డు ఉన్న పేద కుటుంబం ఆధార‌ప‌డే వ్య‌క్తి మ‌ర‌ణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ప‌డ‌కుండా ఆదుకునేందుకు ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంది. ఈ ప‌థ‌కం కోసం జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏటా సుమారు రూ.583 కోట్లు ఖ‌ర్చు చేస్తోంది. అయితే, చాలామందికి ఈ ప‌థ‌కం గురించి ఇంకా అవ‌గాహ‌న లేదు. ఈ ప‌థ‌కానికి ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి, అర్హులు ఎవ‌రు, ప్ర‌భుత్వం నుంచి ఎటువంటి స‌హాయం అందుతుంది వంటి కీల‌క స‌మాచారం ఇక్క‌డ‌ తెలుసుకోండి.

వైఎస్సార్ బీమా ప‌థ‌కానికి అర్హ‌త బియ్యం కార్డు ఉండ‌ట‌మే. బియ్యం కార్డు ఉన్న ప్ర‌తి పేద కుటుంబానికి ఈ ప‌థ‌కం వ‌ర్తిస్తుంది. ఈ ప‌థ‌కంలో న‌మోదైన వారిలో ఎవ‌రైనా 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు క‌లిగిన వారు ప్ర‌మాద‌వ‌శాత్తు శాశ్వ‌త వైకల్యం చెందినా, మ‌ర‌ణించినా ఐదు ల‌క్ష‌ల రూపాయ‌లు ప‌రిహారం అందుతుంది. 51 నుంచి 70 ఏళ్ల వారు ప్ర‌మాద‌వ‌శాత్తు శాశ్వ‌త వైక‌ల్యం చెందినా, మ‌ర‌ణించినా మూడు ల‌క్ష‌ల రూపాయ‌లు అందుతాయి. 18 నుంచి 50 ఏళ్ల వ‌య‌స్సు వారు స‌హ‌జంగా మ‌ర‌ణిస్తే రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల ప‌రిహారం అందుతుంది.

గ్రామ‌, వార్డు వాలంటీర్ల ద్వారా ఈ ప‌థ‌కానికి అర్హుల‌ను ఎంపిక చేస్తున్నారు. వాలంటీర్లు డోర్ టూ డోర్ స‌ర్వే ద్వారా అర్హుల‌ను గుర్తిస్తారు. బియ్యం రేష‌న్ కార్డు ఉన్న వారు ఈ ప‌థ‌కానికి అర్హులుగా ఉంటారు. వాలంటీర్లు స‌ర్వే ద్వారా వివ‌రాలు సేక‌రించి గ్రామ స‌చివాల‌యంలో అంద‌జేస్తారు. స‌చివాల‌యంలోని సంక్షేమ కార్య‌ద‌ర్శి ఈ ప‌థ‌కాన్ని ప‌ర్య‌వేక్షిస్తారు.

ఈ బీమా ప‌‌థ‌కంలో న‌మోద‌య్యేందుకు ఏదైనా జాతీయ బ్యాంకులో సేవింగ్స్ లేదా జ‌న్ ధ‌న్ బ్యాంకు ఖాతా తెర‌వాల్సి ఉంటుంది. అప్పుడు నామినీ పేరును చేర్చాలి. వైఎస్సార్ బీమాలో న‌మోదు చేయించుకోవడానికి సంవ‌త్స‌రానికి కేవ‌లం రూ.15 ప్రీమియంగా చెల్లిస్తే స‌రిపోతుంది. మిగ‌తా ప్రీమియం మొత్తాన్ని ప్ర‌భుత్వ‌మే మీ త‌ర‌పున చెల్లిస్తుంది. గ్రామ స‌చివాల‌యాలు బీమా నమోదుకు, బీమా ప్రాసెసింగ్, క్లెయిమ్ చెల్లింపుకు కేంద్రాలుగా ప‌నిచేస్తాయి. కాబ‌ట్టి, ప్ర‌జ‌లు ఎక్క‌డికో తిర‌గాల్సిన అవ‌స‌రం లేకుండా గ్రామంలోనే ఈ ప‌థ‌కాన్ని పొంద‌వ‌చ్చు.

వైఎస్సార్ బీమా పొందేందుకు వ‌య‌స్సును నిర్ధారించుకునేందుకు గానూ ఆధార్ కార్డును అంద‌జేయాల్సి ఉంటుంది. నామినీ పేరు చెప్పాలి. నామినీగా భార్య లేదా 21 సంవ‌త్స‌రాలు నిండ‌ని కుమారుడు లేదా పెళ్లి కాని కూతురు లేదా వితంతువు అయిన కూతురును నామినీగా పెట్టుకోవ‌చ్చు. ప‌థ‌కంలో న‌మోదైన వారికి ఒక ఐడెంటిటీ కార్డు, యూనిక్ ఐటీ నెంబ‌రు, పాల‌సీ నెంబ‌రును ఇస్తారు.

ఏదైనా ప్ర‌మాదం జ‌రిగినా, మ‌ర‌ణించినా క్లైయిమ్ చేసుకున్న‌15 రోజుల్లో బీమా డ‌బ్బులు వ‌స్తాయి. సెర్ప్ కింద ఉండే స‌మాఖ్య‌లు క్లైయిమ్‌ను ప్రాసెస్ చేస్తాయి. ఈ డ‌బ్బులు నేరుగా బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తారు. ఇందుకు గానూ బ్యాంకు ఖాతా త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. ఈ ప‌థ‌కం విష‌యంలో ఎటువంటి స‌మ‌స్య‌లు ఉన్నా డీఆర్‌డీఏ పీడీని సంప్ర‌దించ‌వ‌చ్చు.

Related News