logo

  BREAKING NEWS

ముగిసిన 5 గంటల డెడ్ లైన్.. ఎస్ఈసీకి అధికారుల షాక్!  |   కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి ముహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన!  |   అయోధ్య రామ‌మందిరానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ విరాళం  |    గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం తెలుస్తారో?  |   చికెన్‌, కోడిగుడ్లు ఇలా తింటే డేంజ‌ర్‌.. fssai జాగ్ర‌త్త‌లు  |   తిరుపతి ఉపఎన్నిక పోరులో జనసేన అభ్యర్థి.. పవన్ క్లారిటీ!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇక వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు  |   పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల షాక్!  |   ‘కాబోయే సీఎం కంగ్రాట్స్’ వేదికపైనే షాకిచ్చిన మంత్రి.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |  

ఆలయాలపై దాడులు: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!

తిరుపతిలో నాలుగు రోజుల పాటు జరగనున్న ఆంధ్రప్రదేశ్ పోలీస్ డ్యూటీ మీట్ లో ముఖ్యమంత్రి వర్చువల్ విధానం ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో ఆలయాల్లోని విగ్రహాలపై వరుస దాడుల ఘటనలను ముఖ్యమంత్రి వైఎస్ జగనోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ ఘటనపై జగన్ స్పందిస్తూ.. ఏపీ రాజకీయాల్లో గెరిల్లా వార్ఫేర్ (యుద్ధం) నడుస్తుందని కీలక వ్యాఖ్యలు చేసారు. అలాంటి వారిని ఎదుర్కునేందుకు మన ఆలోచన తీరు కూడా మారాల్సి ఉందన్నారు.

ఇలాంటి యుద్దాన్ని ఎలా ఎదుర్కోవాలి? అందుకు టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలంటూ పోలీసులకు సూచించారు. ఏపీలోని ఆలయాలపై దాడులను జగన్ మరోసారి తీవ్రంగా ఖండించారు. బాధ్యులు ఎంతటివారైనా వారిని విడిచి పెట్టె ప్రసక్తే లేదని స్పష్టం చేసారు. అర్థరాత్రి అందరూ పడుకున్నాక దాడులు జరుపుతున్నారు. మళ్ళీ దాడులు చేసిన వారే సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెడుతున్నారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు సంక్షేమ పథకాలను ప్రారంభించాలని అనుకున్నా ఇలాంటి వారు అడ్డుపడుతున్నారన్నారు. దేవుడంటే భయం, భక్తి లేకుండా ఆలయాలపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రాజకీయ లబ్ది కోసం విగ్రహాలపై దాడులు చేస్తున్న వారికి గుణపాఠం చెప్పి తీరాల్సిందేనన్నారు.

వారిపై కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేసారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆయన ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా గుళ్ళు, గోపురాలను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

Related News