తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు వైఎస్ షర్మిల. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిలతో భేటీ అయ్యారు. వైఎస్ జగన్ కు అత్యంత స్నానిహితుడిగా అల్లా రామకృష్ణ రెడ్డికి పేరుంది.
గురువారం హైద్రాబాద్ లోటస్ పాండ్ లోని ఆమె నివాసంలో షర్మిలతో పాటుగా ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ తో ఆయన భేటీ అయ్యారు. సుదీర్ఘ సమయం పాటు ఈ భేటీ కొనసాగించి అయితే ఇందుకు సంబందించిన విషయాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ భేటీ వైఎస్ జగన్ అనుమతితోనే జరుగుతుందనే చర్చ జరుగుతుంది.
కాగా రెండు రోజుల క్రితం షర్మిల ఆత్మీయ సమ్మేళనం పేరుతో షర్మిల ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా ఆమె నల్గొండ జిల్లా ముఖ్య నేతలను కలుసుకున్నారు. ఈ నెల 20 న ఆమె ఖమ్మంలో పర్యటించనున్నారు. కాగా తెలంగాణలో పార్టీకి షర్మిల సన్నాహాలు చేసుకుంటుండగా ఆళ్ల రామకృష్ణారెడ్డితో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.