ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల రేపు హైద్రాబాద్లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. నగరంలోని లోటస్ పాండ్ లో వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలతో ఆమె సమావేశం కానున్నారు. రేపు జరగనున్న ఆత్మీయ సమ్మెలనానికి అభిమానులు, అనుచరులు భారీగా తరలి రావాలంటూ సోషల్ మీడియాలో భారీగా పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
అయితే ఈ విషయంపై తెలంగాణ వైసీపీ శ్రేణులు స్పందిస్తూ తమకు దీనిపై ఎలాంటి సమాచారం అందలేదని స్పష్టం చేసారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయం ఆమె బెంగుళూరు నుంచి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. కాగా ఈ సమావేశానికి వైఎస్సార్ అభిమానులు తరలిరావాలంటూ ఆమె స్వయంగా ఫోన్ ద్వారా ఆహ్వానిస్తున్నారని సమాచారం అందుతుంది. అయితే ఈ సమావేశం వెనుక షర్మిల అజెండా ఏమిటనే విషయం పై స్పష్టత రావలసిఉంది. కొంతకాలంగా తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నారనే వార్తల నేపథ్యంలో తాజా సమావేశం చర్చనీయాంశంగా మారింది.