logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

షర్మిల ప్రేమ‌క‌థలో సినిమాను మించిన ట్విస్టులు.. బ‌య‌ట‌పెట్టిన విజ‌య‌మ్మ‌‌

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్ కూతురు, ప్ర‌స్తుత ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సోద‌రి వైఎస్ ష‌ర్మిల తెలుగు ప్ర‌జ‌ల‌కు బాగా తెలిసిన మ‌హిళ‌. అయితే ఆమె వ్య‌క్తిగ‌త జీవితంపై కూడా కొంద‌రు అనేక అనుమానాలు, అబ‌ద్ధ‌పు ప్ర‌చారాలు సృష్టించారు. ష‌ర్మిల రెండో వివాహం గురించి ప‌లు ప్ర‌చారాలు ఉన్నాయి. అయితే, అస‌లు ఆమె జీవితంలో ఏం జ‌రిగింద‌నేది మాత్రం వైఎస్ కుటుంబీకుల‌కు, వారి అత్యంత స‌న్నిహితుల‌కు మాత్ర‌మే తెలుసు.

తాజాగా ఈ విష‌యాల‌ను వైఎస్ విజ‌య‌మ్మ బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌జేశారు. ష‌ర్మిల – అనిల్ ప్రేమ‌, పెద్ద‌లు నిరాక‌రించ‌డం, ష‌ర్మిల‌కు ఇష్టం లేని వివాహం చేయ‌డం, విడాకులు పొంద‌డం, ప్రేమించిన వ్య‌క్తినే పెళ్లాడ‌టం, ఈ మొత్తం స‌మ‌యంలో వైఎస్ కుటుంబ‌స‌భ్యులు అనుభ‌వించిన మాన‌సిక క్షోభ గురించి విజ‌య‌మ్మ మొద‌టిసారి బ‌య‌ట‌కు చెప్పారు. నాలో, నాతో వైఎస్సార్ అనే పేరుతో త‌న భ‌ర్త వైఎస్సార్‌తో త‌న జ్ఞాప‌కాల‌ను గుర్తు చేస్తూ విజ‌య‌మ్మ ఒక పుస్త‌కం రాశారు. ఇది ఇటీవ‌లే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆవిష్క‌రించారు.

ఈ పుస్త‌కంలో వైఎస్ గురించి, వైఎస్ కుటుంబం గురించి బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌ని చాలా విష‌యాల‌ను విజ‌య‌మ్మ రాశారు. ఇందులో ష‌ర్మిల ప్రేమ‌క‌థ కీల‌క‌మైన‌ది. ష‌ర్మిల‌ది రెండో పెళ్లి అని చాలా మందికి తెలుసు కానీ ఎందుకు రెండో పెళ్లి చేసుకుంద‌నే విష‌యం చాలా మందికి తెలియ‌దు. ముఖ్యంగా అనిల్‌ను ష‌ర్మిల ఎంత‌గా ప్రేమించిందో ఈ పుస్త‌కంలో విజ‌య‌మ్మ రాశారు. ”మొద‌ట ష‌ర్మిల – అనిల్ మ‌ధ్య స్నేహం చిగురించింది. అనిల్‌కు కూడా వైఎస్సార్ అంటే చాలా అభిమానం. ఈ కార‌ణంగా అనిల్ అంటే ష‌ర్మిల‌కు ఇష్టం ఏర్ప‌డింది.

ఈ ఇష్టం కొంత‌కాలానికే ప్రేమ‌గా మారింది. ష‌ర్మిల అంటే వైఎస్సార్‌కు ప్రాణం. ఇద్ద‌రూ స్నేహితులుగా ఉండేవారు. ఓ రోజు భోంచేసేట‌‌ప్పుడు ష‌ర్మిల త‌న ప్రేమ విష‌యం వైఎస్సార్‌కు చెప్పారు. విష‌యం విన‌గానే విజ‌య‌మ్మ‌కు కోపం వ‌చ్చింది. కానీ, వైఎస్ మాత్రం.. ఇంత వ‌ర‌కు నీ ఇష్టాల‌ను నేను కాద‌న‌లేదు, కానీ, ఈ విష‌యంలో మాత్రం ఒప్పుకోలేను అని చెప్పారు. వారి సంప్ర‌దాయాలు, మ‌న సంప్ర‌దాయాలు వేరు. ఇప్పుడు బాగానే ఉంటుంది. కానీ, పెళ్ల‌య్యాక వారి ఇంటికి వెళ్లి ఉండాల్సిన దానివి. నేను ఒప్పుకొను అని వైఎస్సార్ తేల్చేశారు. ఆ రోజు వ‌ర‌కు సంతోషంగా ఉన్న కుటుంబంలో ష‌ర్మిల ప్రేమ కార‌ణంగా ఆ సంతోష‌మంతా దూర‌మైంది.

తన తండ్రిని ఒప్పించ‌గ‌లుగుతాన‌నే న‌మ్మ‌కంతో ష‌ర్మిల ఉండేది. ర‌హ‌స్యంగా వివాహం చేసుకొని ప్రెస్ ముందుకు వెళ్లండి అని కూడా కొంద‌రు ష‌ర్మిల‌కు స‌ల‌హాలు ఇచ్చార‌ట‌. కానీ, త‌న తండ్రికి చెడ్డ పేరు తీసుకొచ్చే ప‌ని చేయ‌న‌ని వారికి ష‌ర్మిల చెప్పేసింది. ఇలానే రోజులు గ‌డిచిపోయాయి. ఎప్పుడూ ఆప్యాయంగా ఉండే తండ్రి – కూతురు న‌డుమ స‌రిగ్గా మాట‌లు కూడా ఉండేవి కాదు. ఇంత‌లో మా చిన్న త‌మ్ముడు చందుకు ష‌ర్మిల‌ను ఇచ్చి వివాహం చేయాల‌ని రెండు కుటుంబాల వాళ్ల‌ము ఒక నిర్ణ‌యానికి వ‌చ్చాము. చందుతో వివాహం ష‌ర్మిల‌కు ఇష్టం లేదు. అయితే, నా ఒత్తిడి వ‌ల్ల ష‌ర్మిల ఈ వివాహానికి బ‌ల‌వంతంగా అంగీక‌రించింది. ఇద్ద‌రికీ నిరాడంబ‌రంగా పెళ్లి జ‌రిపించాం.

అయితే, త‌న మ‌న‌స్సు బాగా లేద‌ని, బ‌ల‌వంతంగా పెళ్లి చేసుకున్నందున చందు ఇంటికి వెళ్ల‌డానికి కొంత స‌మ‌యం కావాల‌ని ష‌ర్మిల అడిగింది. పెళ్లి కాగానే మా ఇంటికే వ‌చ్చేసింది. రోజులు గ‌డుస్తున్నా మ‌న‌స్సు చంపుకొని కాపురానికి వెళ్లేందుకు ష‌ర్మిల అంగీక‌రించ‌లేదు. ష‌ర్మిల మ‌న‌స్సు ఎంత‌కూ మార‌క‌పోవ‌డంతో కొంత‌కాలం త‌ర్వాత చందు జీవితం గురించి ఆలోచించి ఇద్ద‌రికీ వైఎస్సార్ విడాకులు ఇప్పించారు. చందుకు ద‌గ్గ‌రుండి మ‌రో పెళ్లి జ‌రిపించారు.

ష‌ర్మిల – అనిల్ ప్రేమ‌ను వ్య‌తిరేకించ‌డం, ష‌ర్మిల‌కు ఇష్టం లేని పెళ్లి చేయ‌డం, విడాకులు తీసుకోవ‌డంతో మా ఇంట్లో బాధ మ‌రింత పెరిగింది. ఆ రోజుల్లో ఇంట్లో సంతోషం మొత్తం దూర‌మైంది. వైఎస్సార్ కూడా కూతురు జీవితాన్ని చూసి ఎంతో కుమిలిపోయేవారు. కొంత‌కాలం పాటు త‌న మ‌న‌స్సుకు ప్ర‌శాంతత కావాల‌ని, అమెరికా వెళ్తాన‌ని ష‌ర్మిల చెప్పింది. ఇందుకు అంద‌ర‌మూ అంగీక‌రించి అమెరికా పంపించాం.

ఓ రోజు ఎన్నిక‌లు, టిక్కెట్ల బిజీలో వైఎస్సార్ ఢిల్లీలో ఉండ‌గా ష‌ర్మిల ఆయ‌న‌కు ఫోన్ చేసింది. తాను ప్రేమించిన అనిల్‌నే పెళ్లి చేసుకున్నాన‌ని చెప్పింది. మొద‌ట ఆలోచ‌న‌లో ప‌డ్డా వైఎస్సార్ వెంట‌నే అంగీక‌రించారు. ఏమైపోతుందో అనుకున్న కూతురు జీవితం ఒక దారిలోకి వ‌చ్చినందుకు సంతోషప‌డ్డారు. ఆయ‌నే మా అంద‌రికీ న‌చ్చ‌జెప్పి అనిల్ – ష‌ర్మిల‌ను వెంట‌నే ఇండియాకు ఆహ్వానించారు. కూతురు ఇష్టాన్ని అర్థం చేసుకోక‌పోవ‌డంతో మా ఇంట్లో మొద‌లైన ఈ సంఘ‌ర్షణ‌ ష‌ర్మిల – అనిల్ వివాహంతో త‌గ్గి మ‌ళ్లీ ఆనందం మొద‌లైంది.

అప్ప‌టి నుంచి పిల్ల‌ల ఇష్టప్ర‌కార‌మే పెళ్లిలు చేయాల‌ని వైఎస్సార్ అంద‌రితో చెప్పేవారు. అనిల్‌కు వైఎస్ అంటే చాలా అభిమానం. మాకు జ‌గ‌న్, ష‌ర్మిల‌తో పాటు అనిల్‌, భార‌తి కూడా మా పిల్ల‌లుగానే భావించాం. వారిద్ద‌రు మాకు దేవుడిచ్చిన పిల్ల‌లు అనుకుంటాం అంటూ ష‌ర్మిల జీవితం, వైఎస్ కుటుంబం అనుభ‌వించిన క్లిష్ట ప‌రిస్థితుల‌ను వైఎస్ విజ‌య‌మ్మ త‌న పుస్త‌కం ద్వారా అంద‌రితో పంచుకున్నారు.

Related News