ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ గా మారింది. నిన్న ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి వైఎస్సాఆర్ అభిమానులు, అనుచరులు భారీగా తరలిరావాలంటూ ఆమె పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా హైదరాబాద్లోని లోటస్ పాండ్లో ఆమె తెలంగాణకు చెందిన కొందరు వైసీపీ నేతలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అభిమానులతో పాటుగా కొందరు వైసీపీ నేతలు, వైఎస్సార్ సన్నిహితులకు పిలుపునిచ్చారు. మరికొద్ది సేపట్లో నల్గొండ ముఖ్య నేతలతో ఆమె సమావేశం కానున్నారు.
తెలంగాణాలో వైఎస్సార్ లేని లోటు స్పష్టంగా తెలుస్తుందన్నారు. త్వరలోనే రాష్ట్రంలో రాజన్న రాజ్యం తెస్తామని ప్రకటించారు. అందులో భాగంగానే నల్గొండ జిల్లా ముఖ్య నేతలను కలిసి క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోనున్నానని అన్నారు. ఆ తర్వాత మిగిలిన జిల్లాలో కూడా పర్యటిస్తానన్నారు. అయితే అభిమానులతో చెప్పకుండా పార్టీ పెట్టనని స్పష్టం చేసారు. షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలతో త్వరలోనే పార్టీ ప్రకటన ఉండబోతుందనే అనుమానాలు బలపడుతున్నాయి.