logo

  BREAKING NEWS

క‌రోనా వ్యాక్సిన్ కావాలంటే బీజేపీకే ఓటేయాలా ?  |   గుడ్ న్యూస్: వ్యాక్సిన్ రిలీజ్ డేట్ చెప్పేసిన భార‌త్ బ‌యోటెక్‌  |   మీ పిల్ల‌ల‌కు ఉచితంగా కార్పొరేట్ స్థాయి హాస్ట‌ల్‌తో కూడిన‌ విద్య కావాలా  |   RRR టీజ‌ర్ కాపీ కొట్టారా..? ప్రూఫ్స్ చూపిస్తున్న నెటిజ‌న్లు  |   ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |   కిడ్నాప్ చేసిన గంట‌లోనే హ‌త్య చేశారు.. ఆ భ‌యంతోనే..!  |   దీక్షిత్‌ను పొట్ట‌న పెట్టుకున్న కిడ్నాప‌ర్లు  |   మ‌ళ్లీ తెర‌పైన శ్రీహ‌రి, సౌంద‌ర్య‌ను చూసే అరుదైన‌ అవ‌కాశం  |   కేసీఆర్‌తో గొడ‌వ ఎక్క‌డ మొద‌లైందో చెప్పిన కోదండ‌రాం  |  

రాత్రి 7 గంట‌లకు బ‌య‌ట‌కొచ్చి చ‌ప్ప‌ట్లు కొట్టాలి.. జ‌గ‌న్ రిక్వెస్ట్‌

మ‌నంద‌రికీ ఇంటి వ‌ద్ద‌కే వ‌చ్చి, మ‌న త‌లుపు త‌ట్టి స‌హాయం చేస్తున్న గ్రామ స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌, వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను ప్రారంభించి ఇవాళ‌టికి ఏడాది అవుతోంద‌ని ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామ వాలంటీర్లు ఎటువంటి వివ‌క్ష లేకుండా, లంచాల‌కు తావు లేకుండా నేరుగా ఇంటికి వ‌చ్చి మంచి చేస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. గ్రామ స్వ‌రాజ్యం మ‌న క‌ళ్లెదుట క‌నిపించిలే వాలంటీర్లు, స‌చివాల‌య ఉద్యోగులు మ‌న‌కు సేవ‌లు అందిస్తున్నార‌ని పేర్కొన్నారు.

ఎటువంటి లాభాపేక్ష లేకుండా మ‌న‌కు సేవ‌లు అందిస్తున్న గ్రామ స‌చివాల‌య ఉద్యోగులు, వాలంటీర్ల‌కు సంఘీభావంగా, ప్రోత్స‌హించేంందుకు ఇవాళ రాత్రి 7 గంట‌ల‌కు ఇంటి బ‌య‌ట‌కు వ‌చ్చి చ‌ప్ప‌ట్లు కొట్టాల‌ని రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను జ‌గ‌న్ కోరారు. తాను కూడా రాత్రి 7 గంట‌ల‌కు ఇంటి బ‌య‌ట‌కు వ‌చ్చి చ‌ప్ప‌ట్లు కొట్టి గ్రామ వాలంటీర్ల‌ను అభినందిస్తాన‌ని ఆయ‌న తెలిపారు.

గాంధీజీ క‌ల‌లు గ‌న్న గ్రామ స్వ‌రాజ్యాన్ని తీసుకొచ్చామ‌ని జ‌గ‌న్ చెప్పారు. అన్ని సేవ‌లు గ్రామాల్లోనే అందేలా చేస్తున్నామ‌ని అన్నారు. ఎన్నిక‌ల మ్యానిఫెస్టోను ప‌విత్రంగా భావిస్తూ అన్ని హామీల‌ను నెర‌వేరుస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌తి పేద గిరిజ‌నుడికి 2 ఎక‌రాల భూమి ఇవ్వ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు చెప్పారు. గిరిజ‌నుల‌ను నా సొంత కుటుంబంగా భావిస్తున్న‌ట్లు చెప్పారు.

Related News