logo

  BREAKING NEWS

మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |   ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ నోటిఫికేషన్ రద్దు!  |   బ్రేకింగ్: తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు..!  |   మున్సిప‌ల్ ఎన్నిక‌లపై సీక్రెట్ స‌ర్వే.. రిజ‌ల్ట్ చూసి షాకైన జ‌గ‌న్‌  |   బంగారం కొనేవారికి బ్యాడ్‌ న్యూస్.. పెరిగిన బంగారం ధ‌ర‌లు  |   బ్రేకింగ్: నిమ్మగడ్డ వివాదాస్పద నిర్ణయానికి హైకోర్టు బ్రేకులు.. భారీ ఎదురుదెబ్బ!  |   ఆనాడు జగన్ ను అడ్డుకున్నారు.. బాబుపై ఏపీ మంత్రి ధ్వజం  |   మంత్రి కేటీఆర్ కు సవాల్.. ఓయూ క్యాంపస్ దగ్గర ఉద్రిక్తత!  |   హైటెన్షన్: చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. ఎయిర్పోర్టులో బైఠాయింపు!  |  

మూగజీవాన్ని కాపాడి మంచిమనసు చాటుకున్న జగన్ .. వీడియో వైరల్!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి మంచి మనసును చాటుకున్నారు. సంక్రాంతి సందర్భంగా టీటీడీ దేశవాదాయ శాఖ ఆధ్వర్యంలో 2,147 ఆలయాల్లో గోపూజ కార్యక్రమం నిర్వహించారు. కనుమ ఉత్సవాల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. ప్రజలందరికీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు సంబందించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గుంటూరు జిల్లాలోని నర్సారావు పేట లో మున్సిపల్ స్టేడియంలో జరిగిన ఈ వేడుకల్లో నిన్న జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు స్టాల్స్ ను సందర్శించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న గంగిరెద్దు ఒకటి ఆశీర్వదిస్తున్నట్టుగా తల ఊపింది. పక్కనే ఉన్న ఇనుప రాడ్డు గంగిరెద్దు తలకు తగులుతుందని భావించిన జగన్ అప్రమత్తమయ్యారు. ఇనుప రాడ్డుకు తన చేతిని అడ్డు పెట్టారు. ఆ తర్వాత దాని తలను సున్నితంగా పక్కకి తప్పించారు. గంగిరెద్దుకు చెందిన వ్యక్తికి జాగ్రత్తలు చెపుతూ అక్కడి నుంచి ముందుకు కదిలారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

Related News