logo

  BREAKING NEWS

క‌డుపులో మంట ఎందుకొస్తుంది ? ఎలా త‌గ్గించుకోవాలి ?  |   ఇక మీ గ‌డ‌ప వ‌ద్ద‌కే బ్యాంకు వ‌స్తుంది.. కొత్త స‌ర్వీసు  |   బ్రేకింగ్‌: తెలుగుదేశం పార్టీ పార్ల‌మెంటు అధ్య‌క్షుల నియామ‌కం  |   ఆ ఛాన‌ల్ ప్రోగ్రాంకు రాక‌పోయి ఉంటే ఎస్పీ మ‌న‌తోనే ఉండేవారా..?  |   బీజేపీ జాతీయ క‌మిటీ నియామ‌కం.. న‌లుగురు తెలుగువాళ్ల‌కు చోటు  |   టీడీపీ, వైసీపీ శ్రేణుల‌ను ఉర్రూత‌లూగించిన ఆ రెండు పాట‌లు పాడింది బాలునే  |   సొంతిల్లు దానం.. స‌మాధిపై ఏం రాయాలో ముందే చెప్పిన బాలు  |   శానిటైజ‌ర్ ఎక్కువ‌గా వాడుతున్నారా..? ఈ ప్ర‌మాదాలు ఉన్నాయి జాగ్ర‌త్త‌..!  |   విషాద వార్త‌… ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఇక లేరు  |   తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |  

చంద్ర‌బాబు స‌వాల్‌కు సై అంటున్న జ‌గ‌న్‌..? రెఫ‌రెండంకు సిద్ధం.?

ఆంధ్ర‌ప్రదేశ్‌లో మూడు రాజ‌ధానుల బిల్లు‌కు గ‌వ‌ర్న‌ర్ ఆమోద‌ముద్ర వేయ‌డంతో మ‌రోసారి రాష్ట్రంలో రాజ‌కీయ ర‌గడ మొద‌లైంది. ప్ర‌తిప‌క్ష నేత‌గా అప్పుడు అమ‌రావ‌తికి మ‌ద్ద‌తు ఇచ్చిన జ‌గ‌న్ ఇప్పుడు మోసం చేశార‌ని ఇత‌ర పార్టీలు, రాజ‌ధాని రైతులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్ర‌జ‌లంతా అమ‌రావ‌తికి మాత్ర‌మే అనుకూలంగా ఉన్నార‌ని తెలుగుదేశం పార్టీ వాదిస్తోంది. ఆఖ‌రికి విశాఖ‌ప‌ట్నం, రాయ‌ల‌సీమ ప్ర‌జ‌లు కూడా అమ‌రావ‌తి మాత్ర‌మే రాజ‌ధానిగా ఉండాల‌ని కోరుకుంటున్నార‌ని టీడీపీ చెబుతోంది.

రాజ‌ధానిపై ద‌మ్ముంటే రెఫ‌రెండం నిర్వ‌హించాల‌ని తెలుగుదేశం పార్టీ స‌వాళ్లు విసురుతోంది. జ‌న‌సేన పార్టీ కూడా ఇదే డిమాండ్ చేస్తోంది. కృష్ణ‌, గుంటూరు జిల్లాల్లోని టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ స‌వాళ్ల‌కు, డిమాండ్ల‌కు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సై అన‌బోతున్నార‌ని తెల‌స్తోంది. రెఫ‌రెండం తీసుకోవ‌డానికి ఆయ‌న సిద్ధ‌మ‌వుతున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. తాజాగా తెలుగుదేశం పార్టీ రెబ‌ల్‌, గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ మాట‌లు ఈ ప్ర‌చారానికి ఊత‌మిచ్చాయి.

తెలుగుదేశం పార్టీ త‌ర‌పున గ‌న్న‌వ‌రం నుంచి విజ‌యం సాధించిన వ‌ల్ల‌భ‌నేని వంశీ త‌ర్వాత ఆ పార్టీకి దూర‌మై జ‌గ‌న్‌కు జిందాబాద్ కొట్టారు. వైసీపీకి ఆయ‌న అన‌ధికారికంగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నారు. అయితే, ఇప్పుడు తాను రాజీనామాకు సిద్ధ‌మ‌ని, ఉప ఎన్నిక‌ను ఎదుర్కునేందుకు రెడీగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు. త‌న ఉప ఎన్నిక‌ను రాజ‌ధానికి రెఫ‌రెండంగా భావించినా స‌రేన‌ని ఆయ‌న స‌వాల్ చేశారు. ఈ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు కూడా చెప్పాన‌ని తెలిపారు.

ప్ర‌స్తుతం కోవిడ్ కార‌ణంగా ఎన్నిక‌ల జ‌రిగే ప‌రిస్థితి లేనందున ఎదురుచూస్తున్నాన‌ని, ప‌రిస్థితులు కుదురుకున్నాక రాజీనామా చేస్తాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. వంశీ మాట‌ల‌ను బ‌ట్టి చూస్తుంటే రాజ‌ధానిపై టీడీపీ, ఇత‌ర పార్టీ స‌వాళ్ల‌కు ప్ర‌జాభిప్రాయం ద్వారానే జ‌వాబు చెప్పాల‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ భావిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. కృష్ణ‌, గుంటూరు జిల్లాల మ‌ధ్య అమ‌రావ‌తి ఉంది. కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రానికి ఎమ్మెల్యేగా ఉన్న వంశీ, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న మ‌ద్దాలి గిరిధ‌ర్ ఇద్ద‌రూ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేర‌డానికి సిద్ధంగా ఉన్నారు.

అయితే, త‌న పార్టీలో చేరాలంటే ఎమ్మెల్యే ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి రావాల‌నేది జ‌గ‌న్ కండీష‌న్‌. అందుకే వీరిద్ద‌రూ అధికారికంగా వైసీపీలో చేరలేదు. ఇప్పుడు వీరిద్ద‌రిని ఎమ్మెల్యే ప‌ద‌వుల‌కు రాజీనామా చేయించి, వైసీపీ త‌ర‌పున పోటీ చేయించాల‌నే ఆలోచ‌న ఆ పార్టీలో ఉంది. ఈ ప‌ని చేయ‌డం ద్వారా చెప్పిన‌ మాట ప్ర‌కారం రాజీనామా చేయించిన త‌ర్వాత‌నే వేరే పార్టీ ఎమ్మెల్యేల‌ను జ‌గ‌న్ త‌న పార్టీలో చేర్చుకున్నార‌నే పేరు వ‌స్తుంది.

దీంతో పాటు కృష్ణ‌, గుంటూరు జిల్లాల‌కు సంబంధించిన ఉప ఎన్నిక‌లు కావ‌డంతో రాజ‌ధాని విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి రెఫ‌రెండంగా ఈ ఎన్నిక‌లు మార‌తాయి. ఈ ఎన్నిక‌ల్లో గెలిస్తే మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేయాల‌నే త‌మ నిర్ణ‌యానికి కృష్ణ‌, గుంటూరు జిల్లాల్లోనూ మ‌ద్ద‌తు ఉంద‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిరూపించుకోవ‌చ్చు. ప‌దేప‌దే ప్ర‌జాభిప్రాయానికి వెళ్దాం అని డిమాండ్ చేస్తున్న పార్టీల‌కు కూడా గ‌ట్టి జ‌వాబు ఇచ్చిన‌ట్లు అవుతుంది అనేది వైసీపీ ఆలోచ‌న‌. గ‌వ‌ర్న‌ర్ మూడు రాజ‌ధానుల బిల్లును ఆమోదించినా ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు హైకోర్టులో ఉంది. కాబ‌ట్టి, ఇప్పుడే మూడు రాజ‌ధానుల ఏర్పాటు జ‌ర‌గ‌క‌పోవ‌చ్చు. ఈ లోపు ఈ రెండు ఉప ఎన్నిక‌లు కూడా పూర్తై, రెండు స్థానాల‌నూ గెలుచుకుంటే ప్ర‌జాభిప్రాయం మేర‌కే మూడు రాజ‌ధానుల చేశామ‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం చెప్పుకోవ‌చ్చు.

Related News