త్రిదండి చినజీయర్ స్వామికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేశారు. చినజీయర్ స్వామి తల్లి అలివేలు మంగతాయరు(85) అనారోగ్యంతో కన్నుమూశారు. నిన్న ఆమె అంత్యక్రియలు జరగాయి. దీంతో జగన్ ఇవాళ చినజీయర్ స్వామికి ఫోన్ చేసి పరామర్శించారు.
అలివేలు మంగతాయరు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం రాత్రి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి కన్నుమూశారు. శంషాబాద్‌లోని త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమం సమీపంలో నిన్న ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.