logo

  BREAKING NEWS

వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |   భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |   సీఎం జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. మతలబేంటి?  |   ”జీవితకాలం శిక్షపడే కేసులు స్వీకరించం”.. అఖిలప్రియకు కోర్టు భారీ షాక్!  |   బ్రేకింగ్: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా..!  |  

ఈ ఒక్క ప‌ని చేయండి.. ఎన్‌డీఏలో చేర‌తాం.. మోడీకి జ‌గ‌న్ రిక్వెస్ట్‌..?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏలో చేర‌నుందా, కేంద్ర ప్ర‌భుత్వంలో భాగం కానుందా అనే చ‌ర్చ గ‌త రెండు వారాలుగా బాగా జ‌రుగుతోంది. ఢిల్లీ వేదిక‌గా జ‌రుగుతున్న రాజకీయ ప‌రిణామాలే ఇందుకు కార‌ణం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా క‌రోనా నుంచి కోలుకుంటున్న క్ర‌మంలో ఎవ‌రినీ ఎక్కువ‌గా క‌ల‌వ‌డం లేదు. ఇటువంటి స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహన్ రెడ్డికి వ‌రుస‌గా రెండు రోజులు అపాయింట్‌మెంట్ ఇచ్చి చ‌ర్చ‌లు జ‌రిపారు.

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ కూడా రాజ‌కీయ ప‌ర‌మైన భేటీల‌కు దూరంగా ఉంటున్నారు. క్యాబినెట్ స‌మావేశాలు కూడా వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా జ‌రుపుతున్నారు. క‌రోనా తీవ్ర‌త ఎక్కువైన త‌ర్వాత ఆయ‌న ఏ ముఖ్య‌మంత్రినీ నేరుగా క‌ల‌వ‌లేదు. అటువంటిది జ‌గ‌న్‌కు అపాయింట్‌మెంట్ ఇచ్చి చ‌ర్చ‌లు జ‌రిపారు. రాష్ట్రానికి సంబంధించిన 17 అంశాల‌పై ప్ర‌ధాని, హోంమంత్రితో ముఖ్య‌మంత్రి మాట్లాడిన‌ట్లు వైసీపీ చెబుతోంది.

అయితే, ప్ర‌ధాని, హోంమంత్రి ఈ స‌మ‌యంలో జ‌గ‌న్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వ‌డం వెనుక త‌ప్ప‌నిస‌రిగా రాజ‌కీయ కార‌ణాలు ఉన్నాయ‌ని నేష‌న‌ల్ మీడియా విశ్లేషిస్తోంది. ఎన్డీఏలోకి ఆహ్వానించ‌డానికే జ‌గ‌న్‌కు ఢిల్లీ పిలిపించి మాట్లాడార‌ని నేష‌న‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. బీజేపీ – వైసీపీ క‌ల‌వ‌క‌పోతే ఇప్ప‌టికిప్పుడు ఈ రెండు పార్టీల‌కు వ‌చ్చిన న‌ష్ట‌మేమీ లేదు. రెండు పార్టీల‌కు పూర్తి స్థాయి మెజారిటీ ఉండ‌టంతో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వాల‌కు ఎటువంటి ప్ర‌మాద‌మూ లేదు.

కాక‌పోతే భ‌విష్య‌త్ అవ‌స‌రాల దృష్ట్యా ఈ రెండు పార్టీలు క‌లిసే దిశ‌గా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఎన్డీఏలో మూడు ద‌శాబ్దాలుగా ఉన్న శిరోమ‌ణి అకాలీద‌ళ్‌, శివ‌సేన బ‌య‌ట‌కు వెళ్లిపోయాయి. ఇప్పుడు బిహార్‌లో జేడీయూ మిన‌హా బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీ ఏదీ ఎన్‌డీఏలో లేదు. ఈ నేప‌థ్యంలో కొత్త మిత్రుల కోసం బీజేపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ద‌క్షిణాది నుంచి అయితే మ‌రింత మేలు అని భావిస్తోంది. 22 మంది లోక్‌స‌భ‌, ఆరుగురు రాజ్య‌స‌భ స‌భ్యుల‌తో బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీగా ఉన్న వైసీపీని ఎన్డీఏలోకి చేర్చుకోవ‌డానికి బీజేపీ మొగ్గు చూపిస్తోంద‌ని తెలుస్తోంది.

జ‌గ‌న్ కూడా వివిధ కార‌ణాల వ‌ల్ల ఎన్డీఏలో చేరడానికి సిద్ధం కావాల్సిన ప‌రిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ఈ విష‌య‌మై ప్ర‌ధానితో జ‌రిగిన స‌మావేశంలో ఎన్డీఏలో చేరేందుకు జ‌గ‌న్ సానుకూల‌త వ్య‌క్తం చేశార‌ని, కాక‌పోతే కొన్ని డిమాండ్ల‌ను ప్ర‌ధాని ముందుంచార‌ని ప్ర‌ముఖ ఆంగ్ల ప‌త్రిక‌లో క‌థ‌నం వ‌చ్చింది. ఈ డిమాండ్ల‌లో ముఖ్య‌మైన‌ది రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా. ప్ర‌త్యేక హోదా తేవ‌డంలో విఫ‌ల‌మైంద‌ని తాము టీడీపీపై ఒత్తిడి తెచ్చినందునే ఆ పార్టీ ఎన్డీఏ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని జ‌గ‌న్ చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

ఇప్పుడు ఈ హామీ నెర‌వేర్చ‌కుండా తాము ఎన్డీఏలో చేరలేమ‌ని ప్ర‌ధాని దృష్టికి జ‌గ‌న్ తీసుకువెళ్లార‌ట‌. ఈ డిమాండ్ నెర‌వేరిస్తే ఎన్డీఏలో చేరేందుకు సిద్ధ‌మేన‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశార‌ని చెబుతున్నారు. జ‌గ‌న్‌తో భేటీ త‌ర్వాత ప్ర‌ధాని మోడీ హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి ప్ర‌త్యేక హోదా, ఎన్డీఏలో వైసీపీ చేరికకు సంబంధించి మ‌రిన్ని చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని సూచించిన‌ట్లు చెబుతున్నారు. జ‌గ‌న్ కూడా త‌మ త‌ర‌పున చ‌ర్చ‌లు జ‌రిపాల‌ని విజ‌య‌సాయిరెడ్డికి సూచించార‌ట‌. ఒక‌వేళ గ‌నుక రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం అంగీక‌రిస్తే ఎన్డీఏలోకి వైసీపీ చేరే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఒక‌వేళ ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోయినా వైసీపీ ఎన్డీఏలో చేరితే టీడీపీ చేతికి బ‌ల‌మైన ఆయుధం స్వ‌యంగా ఇచ్చిన‌ట్ల‌వుతుంది.

Related News