logo

  BREAKING NEWS

గుడ్ న్యూస్‌: క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ వచ్చేసింది..!  |   వైఎస్సార్‌, చంద్ర‌బాబు స్నేహ‌బంధంపై సినిమా  |   క‌రోనా ఖతం అయ్యే డేట్ చెప్పిన బిల్ గేట్స్‌  |   నిజంగానే పాపం త‌గిలిన‌ట్లుంది… క‌రోనాతో ఆ ఎస్సై మృతి  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వల్ల కూడా ఆ ప‌ని కాదు.. కొడాని నాని హాట్ కామెంట్స్‌  |   బ్రేకింగ్‌: మాజీ రాష్ట్ర‌ప‌తికి క‌రోనా పాజిటీవ్‌  |   క‌న్న‌డ దంప‌తుల ధైర్యం… పీఓకేలోని శార‌దాపీఠం నుంచి అయోధ్య‌కు ప‌విత్ర మ‌ట్టి  |   పాక్ నుంచి వ‌చ్చిన ఒకే కుటుంబంలో 11 మంది ఆత్మ‌హ‌త్య‌  |   విజ‌య‌వాడ కోవిడ్ సెంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదానికి కార‌ణాలివే..!  |   ప్లాస్మా దానం అంటే ఏమిటి ? ఎవ‌రు చేయాలి ? ఎలా చేయాలి ?  |  

దేశంలోనే నాలుగో స్థానంలో ఏపీ సీఎం జ‌గ‌న్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రో ఘ‌న‌త సాధించారు. దేశంలోని పాపుల‌ర్ ముఖ్య‌మంత్రుల జాబితాలో జ‌గ‌న్‌కు నాలుగో స్థానం ద‌క్కింది. 78.01 శాతం మంది ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పాల‌న ప‌ట్ల సంతృప్తిగా ఉన్నార‌ని తేలింది. సీ-ఓట‌ర్ అనే ప్ర‌ముఖ స‌ర్వే ఏజెన్సీ దేశ‌వ్యాప్తంగా కేంద్ర ప్ర‌భుత్వం, రాష్ట్ర ప్ర‌భుత్వాల ప‌నితీరుపై స‌ర్వే జ‌రిపి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించింది.

ప్ర‌ధాని మోడీ ప‌నితీరు ప‌ట్ల 58.36 శాతం మంది చాలా సంతృప్తిగా ఉన్నారు. 24.04 శాతం మంది కొంత సంతృప్తితో ఉండ‌గా, 16.71 శాతం మంది పూర్తిగా అసంతృప్తితో ఉన్న‌ట్లు ఈ స‌ర్వే తేల్చింది. ఒడిశా, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, చ‌త్తీస్‌ఘ‌డ్‌లో ప్ర‌ధాని ప‌నితీరుకు 90 శాతానికి పైగా సంతృప్తి వ్య‌క్తం కాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఝార్ఖండ్‌, క‌ర్ణాట‌క‌లో 80 శాతానికి పైగా సంతృప్తి వ్య‌క్త‌మైంది. తెలంగాణ‌లో 71.51 శాతం మంది మోడీ ప‌నితీరు ప‌ట్ల సంతృప్తి వ్య‌క్తం చేశారు. త‌మిళ‌నాడు, కేర‌ళ‌లో కేవ‌లం 32 శాతం మంది మాత్ర‌మే మోడీ ప‌ట్ల సంతృప్తిగా ఉన్నారు.

ఇక‌, మోస్ట్ పాపుల‌ర్ ముఖ్య‌మంత్రుల జాబితాలో 82.96 శాతంతో ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ మొద‌టి స్థానంలో ఉన్నారు. ఆయ‌న త‌ర్వాత చ‌త్తీస్‌ఘ‌డ్ సీఎం భూపేశ్ భాగెల్ 81.06 శాతంతో రెండో స్థానంలో, కేర‌ళ ముఖ్య‌మంత్రి పున‌ర‌యి విజ‌య‌న్ 80.28 శాతంతో మూడో స్థానంలో నిలిచారు. ఇక‌, ఇటీవ‌లే ఏడాది ప‌ద‌వీకాలాన్ని విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ 78.01 శాతంతో నాలుగో స్థానంలో నిలిచారు. ఆయ‌న త‌ర్వాత మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రే, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఉన్నారు.

కాగా, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పాల‌న ప‌ట్ల మాత్రం కొంత అసంతృప్తి ఉన్న‌ట్లు ఈ స‌ర్వేలో తేలింది. ఆయ‌న పాల‌న ప‌ట్ల 54.22 శాతం మంది మాత్ర‌మే సంతృప్తిగా ఉన్నార‌ని స‌ర్వే తేల్చింది. మొత్తంగా కేంద్ర ప్ర‌భుత్వ ప‌నితీరుపై 62 శాతం మంది సంతృప్తిని వ్య‌క్తం చేశారు. ఇక ప్ర‌ధాని మోడీ పాపులారిటీతో పోల్చితే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చాలా దూరంలోనే ఆగిపోయారు. ప్ర‌ధాని మోడీ వైపు 62 శాతం మంది మొగ్గు చూపితే రాహుల్ గాంధీకి 36.12 శాతం మ‌ద్ద‌తు ప‌లికారు. గోవా, త‌మిళ‌నాడు, కేర‌ళ రాష్ట్రాల్లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కంటే రాహుల్ గాంధీకే ఎక్కువ పాపులారిటీ ఉన్న‌ట్లు సీ-ఓట‌ర్ స‌ర్వే అంచ‌నా వేసింది.

Related News