logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

తెలంగాణ వాద‌న‌కు ఏపీ సీఎం జ‌గ‌న్ కౌంట‌ర్‌

రాయ‌ల‌సీమ‌, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల క‌రువు గుర్తుకు వ‌స్తే మ‌న‌స్సు క‌ష్టంగా మారుతోంద‌ని, ఈ జిల్లాల క‌రువును నివారించ‌డానికే పోతిరెడ్డిపాడు సామ‌ర్థ్యం పెంపు, రాయ‌ల‌సీమ క‌రువు నివార‌ణ ప‌థ‌కం నిర్మించ‌ త‌ల‌పెట్టామ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ఏపీ ప్ర‌భుత్వం త‌ల‌పెట్టిన ఈ ప్రాజెక్టుల‌పై తెలంగాణ అభ్యంత‌రం తెలుపుతున్న వేళ జ‌గ‌న్ వ్యాఖ్య‌లు కీల‌కంగా మారాయి. కృష్ణా న‌దిపై తెలంగాణ‌లో అన్ని ప్రాజెక్టులు 800 అడుగుల‌కే ఉన్నాయ‌ని, శ్రీశైలంలో నీటి మ‌ట్టం 796 అడుగులు ఉన్న‌ప్పుడే తెలంగాణ విద్యుత్ ఉత్ప‌త్తి ప్రారంభిస్తోంద‌ని జ‌గ‌న్ అ‌న్నారు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో రాయ‌లసీమ‌, ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాల‌ క‌రువు తీర‌డం క‌ష్టంగా మారుతోంద‌న్నారు. అందుకే దీనికి ప‌రిష్కారంగా తెలంగాణ లాగానే తాము కూడా 800 అడుగుల నుంచే శ్రీశైలం నుంచి నీటిని తీసుకునేందుకు కొత్త ప్రాజెక్టు నిర్మించాల‌నుకుంటున్న‌ట్లు తెలిపారు. రెండు రాష్ట్రాలూ ఎవ‌రికి కేటాయించిన వాటా నీరు వారు వాడుకుంటార‌ని, ఎవ‌రికీ న‌ష్టం ఉండ‌ద‌ని పేర్కొన్నారు. ఇదే స‌మ‌యంలో గోదావ‌రి నీటిని కృష్ణ‌కు మ‌ళ్లించేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నామ‌ని, అలా చేయ‌డం ద్వారా రాష్ట్రం పూర్తిగా స‌స్య‌శ్యామ‌లంగా మారుతుంద‌న్నారు.

రైతుల‌కు మంచి జ‌ర‌గాలి అంటే వ్య‌వ‌సాయం బ‌త‌కాల‌ని, అందుకు క‌చ్చితంగా ప్రాజెక్టులు పూర్తి కావాల‌ని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వ‌చ్చే నాటికి ఏ ప్రాజెక్టులు ఏ స్థాయిలో ఉన్నాయి, జ‌రిగిన అవినీతిని రివ‌ర్స్ టెండ‌రింగ్ ద్వారా ఎలా నిర్మూలించాలి, ఏ ప్రాజెక్టును ప్రాధాన్య‌తాప‌రంగా ఎలా నిర్మించాలి అనే వాటిపై ఒక అంచ‌నాకు రావ‌డానికే ఏడాది కాలం ప‌ట్టింద‌ని చెప్పారు. రివ‌ర్స్ టెండ‌రింగ్ ద్వారా రూ.1,095 కోట్లు జ‌ల‌వ‌న‌రుల శాఖ‌లో ఆదా చేసిన‌ట్లు తెలిపారు. నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి తాను పూర్తి క్లారిటీతో ఉన్న‌ట్లు పేర్కొన్నారు.

ఈ సంవ‌త్స‌రం వంశ‌ధార ఫేజ్ 2 పూర్తి చేయాల‌ని, వంశ‌ధార – నాగావ‌ళి అనుసంధానం చేయాల‌ని, వెలుగొండ ఫేజ్ 1, నెల్లూరు బ్యారేజ్‌, సంగం బ్యారేజ్‌, అవ‌కు ట‌న్నెల్ పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు చెప్పారు. పోల‌వ‌రం ప్రాజెక్టును 2021 నాటికి క‌చ్చితంగా పూర్తి చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంద‌ని, రైతుల క‌ష్టాలు ‌తీర్చేందుకు అన్ని ప్ర‌య‌త్నాలూ చేస్తామ‌ని పేర్కొన్నారు.

Related News