ఎనిమిది నెలల తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సమావేశం అయ్యారు. వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి జగన్ ప్రధానిని కలిశారు. సుమారు 40 నిమిషాల పాటు ప్రధాని, ముఖ్యమంత్రి మధ్య చర్చ జరిగింది.
రాష్ట్ర అభివృద్ధి అజెండాగా ఈ భేటీ జరిగింది. రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సహాయం, చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్ర విభజన హామీలు, తదితర మొత్తం 17 అంశాలపై మోడీకి ముఖ్యమంత్రి జగన్ నివేదించారు. అయితే, వైసీపీని ఎన్డీఏలోకి ప్రధాని అహ్వానిస్తారని గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే, వీరి భేటిలో ఈ అంశం చర్చకు వచ్చిందా, లేదా అనేది తెలియాల్సి ఉంది.
ప్రధాని మోదీతో భేటీ అనంతరం సీఎం జగన్ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంనేందుకు బయలుదేరారు. 1 జన్‌పథ్‌లోని తన ఇంటి నుంచే ఆయన మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఈ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనబోతున్నారు. కృష్ణ జలాల వివాదంపై ఈ సమావేశం జరుగుతోంది.