logo

  BREAKING NEWS

మ‌ళ్లీ తెర‌పైన శ్రీహ‌రి, సౌంద‌ర్య‌ను చూసే అరుదైన‌ అవ‌కాశం  |   కేసీఆర్‌తో గొడ‌వ ఎక్క‌డ మొద‌లైందో చెప్పిన కోదండ‌రాం  |   ఆర్థిక ఇబ్బందుల్లో ప్ర‌ధాని.. ఈ క‌ష్టాలు ఎవ‌రికీ రావేమో..!  |   క‌ర్నూలు మ‌హిళ‌కు దొరికిన‌ కోటి రూపా‌యల వ‌జ్రం  |   బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌  |   ద‌సరా పండుగ రోజు జ‌మ్మి చెట్టుకు ఎందుకు పూజిస్తారో తెలుసా ?  |   హైద‌రాబాద్ వ‌ర‌ద‌లు.. భారీగా విరాళాలు ప్ర‌క‌టించిన హీరోలు  |   ఫిబ్ర‌వ‌రి నాటికి స‌గం మందికి క‌రోనా వైర‌స్‌  |   రాబిన్ శ‌ర్మ‌తో చంద్ర‌బాబు ఒప్పందం..! ఆయ‌న ట్రాక్ రికార్డ్ తెలుసా..?  |   Breaking: వ‌ర‌ద బాధితుల‌కు భారీ సాయం ప్ర‌క‌టించిన కేసీఆర్‌  |  

ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం కోసం ప్ర‌ధాని మోడీకి జ‌గ‌న్ లేఖ‌

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి లేఖ రాశారు. ఇటీవ‌ల మ‌ర‌ణించిన ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని ఈ లేఖ‌లో కోరారు. త‌న జీవిత‌కాలం పాటు సంగీత రంగంలో విశేష కృషి చేసిన బాలు సేవ‌ల‌కు గుర్తుగా దేశ అత్యున్న‌త పౌర‌పుర‌స్కారం ఇవ్వాల‌ని ప్ర‌ధానిని జ‌గ‌న్ కోరారు.

74 ఏళ్ల ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం తెలుగు, హిందీ, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళం వంటి భాష‌ల్లో సుమారు 40 వేల పాట‌ల‌ను పాడారు. న‌టుడిగా, సంగీత ద‌ర్శ‌కుడిగానూ ఆయ‌న ప‌ని చేశారు. ఇటీవ‌ల క‌రోనా బారిన ప‌డిన బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం చెన్నైలోని ఓ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న స్వ‌స్థ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నెల్లూరు.

Related News