logo

  BREAKING NEWS

ఫలించిన ‘శ్వేత రాయబారం’.. మనసు మార్చుకున్న బుద్ధా!  |   హిందూపురంలో సీన్ రిపీట్.. అభిమానికి విశ్వరూపం చూపించిన బాలయ్య!  |   నా అనుచరుడు ఒక్కడు చాలు.. నీ పని ఖతం: టీడీపీలో బుద్ధా వర్సెస్ కేశినేని  |   అవును అప్పులు చేసాం.. ఆ విషయం గర్వంగా చెప్తాం : మంత్రి బుగ్గన  |   షాకింగ్ సర్వే.. హైదరాబాద్ లో ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా!  |   అసెంబ్లీ ఎన్నికల ముందు కేరళ సీఎంకు షాక్.. విజయన్ మెడకు మళ్ళీ అదే కేసు!  |   హై కోర్టుకు ఎన్నికల సంఘం క్షమాపణలు.. ఎందుకంటే?  |   ఇదేనా దోస్తానా..? ఏపీలో అడుగుపెడుతున్న ఎంఐఎం  |   మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |  

ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై క్రైస్త‌వుడిగా ముద్ర‌వేయాల‌ని ప్ర‌తిప‌క్షాలు భావిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న క్రైస్త‌వుడు కాబ‌ట్టే రాష్ట్రంలో ఆల‌యాల‌పై దాడులు జ‌రుగుతున్నాయ‌ని కొంద‌రు ప్ర‌తిప‌క్ష నేత‌లు ఆరోపిస్తున్నారు. అస‌లు దాడుల వెనుక జ‌గ‌నే దాడులు చేయిస్తున్నార‌ని సైతం కొంద‌రు టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.

దీంతో రాజకీయంగా జ‌గ‌న్‌కు ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు మొద‌ల‌య్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో త‌న‌కు అన్ని మ‌తాలు ఒక‌టేన‌ని, అన్ని మ‌తాల‌నూ గౌర‌విస్తాన‌ని జ‌గ‌న్ నిరూపించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇందులో భాగంగా చంద్ర‌బాబు హ‌యాంలో విజ‌య‌వాడ‌లో కూల్చేసిన ఆల‌యాల పున‌ర్నిర్మానాన్ని జ‌గ‌న్ సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా ప్రారంభించారు.

ఇవాళ గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేట‌లో టీటీడీ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న గోపూజ కార్య‌క్ర‌మంలోనూ జ‌గ‌న్ పాల్గొని గోవుల‌కు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా వేద‌పండితులు.. కుంబాల గోత్రం, ఆర్త్రా న‌క్ష‌త్రం, జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి నామ‌దేఆస్య అంటూ ముఖ్య‌మంత్రి పేరుపై పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. హిందూ మ‌తాచారం ప్ర‌కారం జ‌గ‌న్ గోత్ర‌, నామాల‌తో పూజ‌లు చేయించుకున్నారు.

Related News