logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

ఏపీ సీఎం జగన్ పెద్ద కుమార్తె మరో అరుదైన ఘనత

కన్న బిడ్డలు ఉన్నత స్థానానికి చేరుకోవాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. ఆ కల నిజమైన రోజున వారి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి – భారతి దంపతులు కూడా ఇప్పుడు పుత్రికోత్సాహంతో పొంగిపోతున్నారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె హర్షిణి రెడ్డికి ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన బిజినెస్ స్కూల్ లో సీటు దక్కింది. చిన్ననాటి నుండి చదువులో చురుకుగా ఉండే హర్షారెడ్డి ఇంగ్లాండ్ లోని స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఆమెకు అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు పారిస్ లోని టాప్ కాలేజీ అయిన ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ డిగ్రీ చదవబోతుంది. ఈ నేపథ్యంలో కుమార్తెను పారిస్ పంపేందుకు సీఎం జగన్ దంపతులు మంగళవారం రోజున బెంగుళూరు వెళ్లనున్నారు.

బెంగుళూరు నుంచి పారిస్ పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ చిన్న కుమార్తె వర్షా రెడ్డి అమెరికా ఇండియానా స్టేట్‌లోని ప్రతిష్ఠాత్మక నోట్రే డామ్ యూనివర్శిటీలో అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతోంది. ఇపుడు పెద్ద కుమార్తె మరో ప్రతిష్టాత్మక కాలేజీలో సీటు సంపాదించడంపై వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ అధినేత కుమార్తె ఇంతటి ఘనత సాధించడం తమకెంతో గర్వకారణమని పేర్కొన్నారు.

Related News