logo

  BREAKING NEWS

ముగిసిన 5 గంటల డెడ్ లైన్.. ఎస్ఈసీకి అధికారుల షాక్!  |   కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి ముహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన!  |   అయోధ్య రామ‌మందిరానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ విరాళం  |    గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం తెలుస్తారో?  |   చికెన్‌, కోడిగుడ్లు ఇలా తింటే డేంజ‌ర్‌.. fssai జాగ్ర‌త్త‌లు  |   తిరుపతి ఉపఎన్నిక పోరులో జనసేన అభ్యర్థి.. పవన్ క్లారిటీ!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇక వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు  |   పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల షాక్!  |   ‘కాబోయే సీఎం కంగ్రాట్స్’ వేదికపైనే షాకిచ్చిన మంత్రి.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |  

టీడీపీ, బీజేపీ వ్యూహాల‌కు జ‌గ‌న్ చెక్‌.. మ‌తం ముద్ర‌కు రేపు గ‌ట్టి కౌంట‌ర్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త కొన్ని రోజులుగా మొద‌లైన మ‌త వివాదాల‌కు ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రేపు చెక్ పెట్ట‌బోతున్నారు. త‌న‌పై మ‌తం ముద్ర వేసి రాజ‌కీయంగా దెబ్బ తీయాల‌నుకుంటున్న తెలుగుదేశం పార్టీ, బీజేపీల‌కు గ‌ట్టి కౌంట‌ర్ ఇవ్వ‌నున్నారు. ఆల‌యాలపై దాడుల విష‌యంలోనూ టీడీపీ, బీజేపీ త‌న‌పై చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు త‌న చేత‌ల‌తో బ‌దులు చెప్పాల‌ని, త‌న‌కు అన్ని మ‌తాలూ స‌మాన‌మేన‌ని నిరూపించుకోవాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు.

ముఖ్య‌మంత్రిగా వై.ఎస్‌. జ‌గ‌న్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత ఆయ‌న క్రిష్టియ‌న్ అని, హిందూ వ్య‌తిరేకి అన్ని న‌మ్మించేందుకు పెద్ద ఎత్తున ప్ర‌తిప‌క్షాల ప్ర‌చారం చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అనేక అబ‌ద్ధాలు కూడా ప్ర‌చారం చేశారు. కానీ, వీటిని జ‌గ‌న్ ఎప్పుడూ పెద్ద‌గా సీరియ‌స్‌గా తీసుకోలేదు. త‌ర్వాతి కాలంలో ఇవి అబ‌ద్ధ‌పు ప్ర‌చారాలేన‌ని నిర్ధార‌ణ జ‌రిగింది.

కానీ, ఇప్పుడు మాత్రం జ‌గ‌న్‌కు రాజ‌కీయంగా భారీ న‌ష్టం జ‌రిగేలా కొత్త వివాదాలు మొద‌ల‌య్యాయి. కొంద‌రు దుండ‌గులు హిందూ ఆల‌యాల‌పై దాడులు చేస్తున్నారు. వీటిని ప్ర‌తిప‌క్ష పార్టీలు ప్ర‌భుత్వంపై రుద్దుతున్నాయి. జ‌గ‌న్ క్రిష్టియ‌న్ కాబ‌ట్టే హిందూ ఆల‌యాల‌పై దాడులు చేస్తున్నార‌నే ప్ర‌చారం మొద‌లుపెట్టారు. కొంద‌రు ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన నాయ‌కులైతే జ‌గ‌నే ఈ దాడులు చేయిస్తున్నార‌ని కూడా ఆరోపిస్తున్నారు.

ఇది రాష్ట్రంలోనే కాక దేశ‌వ్యాప్తంగానూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌తిప‌క్ష పార్టీల ప్ర‌చారాన్ని చాలా మంది ప్ర‌జ‌లు కూడా న‌మ్మే ప్ర‌మాదం ఉంది. ముఖ్యంగా ఈ విష‌యంలో జ‌గ‌న్‌పై వ్య‌తిరేక‌త‌ను క్యాష్ చేసుకునేందుకు టీడీపీ, బీజేపీ పోటీ ప‌డుతున్నాయి. హిందుత్వాన్ని హైజాక్ చేయాల‌ని టీడీపీ చాలా ప్ర‌య‌త్నిస్తోంది. ఒక ద‌శ‌లో మ‌తాల‌పై బీజేపీ కూడా మాట్లాడ‌లేని విధంగా చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇవ‌న్నీ గ‌మ‌నించిన వైసీపీ అప్ర‌మ‌త్త‌మైంది.

ఇంకా ఈ విష‌యంలో ఆల‌స‌త్వం ప‌నికిరాద‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు రేపు విజ‌య‌వాడ‌లో నాలుగు ఆల‌యాల పున‌ర్నిర్మానానికి జ‌గ‌న్ శంకుస్థాప‌న చేయ‌నున్నారు. సీత‌మ్మ పాదాలు, ద‌క్షిణ ముఖ ఆంజ‌నేయ స్వామి ఆల‌యం, రాహు కేతు ఆల‌యం, వేణుగోపాల‌స్వామి ఆల‌యయాల పున‌ర్నిర్మానానికి శంకుస్థాప‌న చేస్తారు. చంద్ర‌బాబు హ‌యాంలో వీటిని కూల్చేశారు. ఇప్పుడు జ‌గ‌న్ వీటిని మళ్లీ నిర్మించ‌డం ద్వారా తాను హిందూ వ్య‌తిరేకిని కాన‌ని, త‌ను అన్ని మ‌తాలూ స‌మాన‌మేన‌ని నిరూపించుకోబోతున్నారు. బీజేపీ, టీడీపీ చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు, త‌న‌పై వేస్తున్న మ‌తం ముద్ర‌కు జ‌గ‌న్ ఈ చ‌ర్య ద్వారా స‌మాధానం ఇవ్వ‌నున్నారు.

Related News