హైదరాబాద్లోని దిల్షుఖ్నగర్ చైతన్యపురిలో కొందరు పోకిరీలు రెచ్చిపోయారు. డ్యూటీకి వెళ్లి ఇంటికి తిరిగివెళ్తున్న దంపతులను వేధించారు. అడ్డుకున్న భర్తపై ఇష్టారీతిన దాడి చేశారు. ఈ ఘటనతో అతడు తీవ్ర గాయాల బారిన పడ్డారు. వివరాల్లోకి వెళ్తే… చైతన్యపురికి చెందిన భార్యాభర్తలు నగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వీరు డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళుతుండగా చైతన్యపురిలో కొందరు పోకిరీలు అటకాయించారు. మహిళను వేధించడం ప్రారంభించారు. దీంతో వారిని అడ్డుకున్న భర్తపైన ఇనుపరాడ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో అతడు గాయపడ్డాడు. బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.