logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

హైదరాబాద్ ఆసుపత్రిలో దారుణం: వెంటిలేటర్ కోసం అర్థిస్తూ కరోనా రోగి మృతి!

ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జవహర్ నగర్ కు చెందిన యువకుడు కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు. కరోనా కారణంగా ఊపిరాడక మరణించాడు. చనిపోయే ముందు అతను తన కుటుంబ సభ్యులకు ఓ వీడియో తీసి పంపాడు. అందులో చాలా సేపటి నుండి ఊపిరి తీసుకోలేకపోతున్నాని, ప్రాణం పోయేలా ఉందని తన తండ్రికి తెలిపాడు. ఉన్న వెంటిలేటర్ ను కూడా సిబ్బంది తీసుకుని వెళ్లిపోయారని ఎంత బతిమాలినా తనను పట్టించ్చుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసాడు.

ఇవే తన ఆఖరి మాటలని భావించి కుటుంబ సభ్యులకు వీడ్కోలు పలికాడు. చివరకు దయనీయ స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ వీడియో బయటకు రావడంతో వైద్యుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా యువకుడు మరణించిన అనంతరం అతనికి కరోనా పాజిటివ్ అని వైద్యులు నిర్దారించారు. అయితే అప్పటికే యువకుడి అంత్యక్రియల్లో 30 మంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. యువకుడికి కరోనా నిర్దారణ కావడంతో వారంతా ఇప్పుడు భయాందోళనకు గురవుతున్నారు.

Related News