logo

  BREAKING NEWS

బ్రేకింగ్: పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. జ‌గ‌న్‌కు భారీ షాక్‌  |   వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |   భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |   సీఎం జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. మతలబేంటి?  |   ”జీవితకాలం శిక్షపడే కేసులు స్వీకరించం”.. అఖిలప్రియకు కోర్టు భారీ షాక్!  |  

ప్రియురాలి చేతిలో ప్రియుడి దారుణ హత్య!

తనతో పెళ్ళికి నిరాకరించి వేరొకరితో ప్రేమలో ఉన్నాడన్న కోపంతో ఓ యువతి ప్రియుడిని దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ధర్మవరం- కాపవరం గ్రామాల మధ్య చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మల్కపల్లికి చెందిన పావని, పాతూరుకు చెందిన తాతాజీ నాయుడు(25) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

ఏడాది నుంచి తనను పెళ్లి చేసుకోవాలంటూ పావని ప్రియుడిపై ఒత్తిడి తెస్తుంది. దీంతో ఆమెను గుడిలో రహస్యంగా వివాహం చేసుకున్నాడు. అయితే ఇటీవల ప్రియుడి ప్రవర్తనలో మార్పు రావడంతో మరొకరితో తాతాజీ ప్రేమలో ఉన్నాడని అనుమానం పెంచుకుంది. ఈ నేపథ్యంలో తనను కుటుంబ సభ్యుల ముందు పెళ్లి చేసుకోవాలంటూ పావని కోరింది.

దానికి తాతాజీ ఒప్పుకోకపోవడంతో ఆమె అనుమానం నిజమని భావించింది. ప్రియుడిపై కక్ష కట్టిన యువతి ఎలాగైనా అతన్ని అంతమొందించాలనుకుంది. పథకం ప్రకారం తాతాజీని మాట్లాడుకుందాం రావాలంటూ ఓ ప్రాంతానికి పిలిచింది. ఆ రోజంతా ఇద్దరూ కలిసి తిరిగారు. ఇంటికి వెళ్లే దారిలో కరుణను ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని బయలుదేరాడు. వెనుక కూర్చున్న పావని తన బ్యాగులో ఉన్న కత్తితో ప్రియుడిని పొడిచింది.

వాహనం నుంచి కింద పడిపోయిన తాతాజీని మెడ, తలా, వీపు భాగంలో విచక్షణారహితంగా పొడిచి హత్య చేసింది. హత్య చేసిన అనంతరం ప్రియుడి శవం పక్కనే రక్తపు మడుగులో కూర్చుని ప్రియుడి తల్లికి ఫోన్ చేసి సమాచారం అందించింది. పావనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related News