logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

ఉద్యోగం కోసం వచ్చిన యువతిపై 2 నెలలుగా గ్యాంగ్ రేప్

కరోనా లాక్ డౌన్ ఆ యువతి పాలిట శాపమైంది. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి తీసుకెళ్లిన కొందరు యవకుల చేతుల్లో చిక్కుకున్న యువతి లాక్ డౌన్ విధించడంతో రెండు నెలల పాటు వారి చేతిలో గ్యాంగ్ రేప్ కు గురైంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే .. మార్చి నెలలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తీసుకొచ్చిన మేనత్త ఆ యువతిని 20వ తేదీన నందన్ అనే వ్యక్తి దగ్గరకు పంపింది. ఉద్యోగం వచ్చిందని ట్రైనింగ్ పూర్తి చేయాలని చెప్పి నందన్ ఆ యువతిని ఓ హోటల్ గదిలో ఉంచాడు. అదే సమయంలో లాక్ డౌన్ విధించడంతో ఆమె అక్కడినుండి బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇదే అదునుగా భావించిన నందన్ ఆ యువతిపై తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.

చంపేస్తానని బెదిరించడంతో గత్యంతరం లేక ఈ వేధింపులను భరించింది. ఇలా రెండు నెలల పాటు యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు నిందితులు. ఇటీవల యువతిని చూడటానికి వచ్చిన ఆమె మేనత్త తనను కిటికీలో నుంచి బయటకు తోసి హతమార్చే ప్రయత్నం చేసిందని, తీవ్ర గాయాలతో బయటపడిన యువతి ఆసుపత్రిలో చేరి అక్కడి నుండి ఈ విషయాన్ని నాలుగు రోజుల క్రితం తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలియజేసానని బాధితురాలు వెల్లడించింది.

సామజిక కార్యకర్త రీనా రౌత్రయ్ ఈ విషయాన్ని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దృష్టికి తీసుకురావడంతో విషయం వెలుగు లోకి వచ్చింది. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కటక్ బంకి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Related News