logo

  BREAKING NEWS

ఫలించిన ‘శ్వేత రాయబారం’.. మనసు మార్చుకున్న బుద్ధా!  |   హిందూపురంలో సీన్ రిపీట్.. అభిమానికి విశ్వరూపం చూపించిన బాలయ్య!  |   నా అనుచరుడు ఒక్కడు చాలు.. నీ పని ఖతం: టీడీపీలో బుద్ధా వర్సెస్ కేశినేని  |   అవును అప్పులు చేసాం.. ఆ విషయం గర్వంగా చెప్తాం : మంత్రి బుగ్గన  |   షాకింగ్ సర్వే.. హైదరాబాద్ లో ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా!  |   అసెంబ్లీ ఎన్నికల ముందు కేరళ సీఎంకు షాక్.. విజయన్ మెడకు మళ్ళీ అదే కేసు!  |   హై కోర్టుకు ఎన్నికల సంఘం క్షమాపణలు.. ఎందుకంటే?  |   ఇదేనా దోస్తానా..? ఏపీలో అడుగుపెడుతున్న ఎంఐఎం  |   మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |  

ప్రేమోన్మాది చేతిలో యువతి దారుణ హత్య!

చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతిని నడి రోడ్డుపై నరికి చంపాడో ప్రేమోన్మాది. తీవ్ర గాయాలపాలైన యువతి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. యువతి మరణవార్త విన్న ఆమె బంధువులు నిందితుడి ఇంటికి నిప్పు పెట్టారు. వివరాల్లోకి వెళితే.. పెనుమానుడు మండలం తూర్పుపల్లికి చెందిన గాయత్రీ(20) అదే గ్రామానికి చెందిన ఢిల్లీ బాబు అనే వ్యక్తిని డిగ్రీ చదువుతున్న సమయంలో ప్రేమించింది.

ఆ సమయంలో యువతి మైనర్ కావడంతో తల్లిదండ్రులు ఆమెను మందలించారు. కాగా గత నెలలో వీరిద్దరూ కలిసి ఇంటి నుంచి పారిపోయి తిరుపతిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. గాయత్రి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసుల కౌన్సలింగ్ అనంతరం తలిదండ్రుల వద్ద ఉండటానికే గాయత్రీ ఇష్టపడింది. పోలీసులు ఇరు కుటుంబాలకు సర్ది చెప్పి వారి వారి ఇళ్లకు పంపించేశారు.

దీంతో గాయత్రిపై కోపం పెందుకున్న ఢిల్లీ బాబు మంగళవారం స్నేహితురాలితో కలిసి బైక్ మీద వెళ్తున్న గాయత్రిని మార్గమధ్యంలో అడ్డగించాడు. కత్తితో ఆమెపై దాడి చేసాడు. మొత్తం 15 కత్తిపోట్లతో విరుచుకుపడ్డాడు. దాడి చేసిన అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

యువతి బంధువులు హుటాహుటిన ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చెన్నై ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో గాయత్రీ మృతి చెందింది. దీంతో మృతురాలి బంధువులు ప్రేమోన్మాది ఇంటికి వెళ్లి అతని తండ్రిపై దాడి చేసారు. ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Related News