logo

రెండవసారి కరోనా.. వైద్యుడి ఇంట తీవ్ర విషాదం!

రెండవసారి కరోనా సోకడంతో ఓ యువ వైద్యుడు కనుమూశాడు. కడప జిల్లా బద్వేలు ప్రభుత్వాసుపత్రిలో పిల్లల డాక్టరుగా పనిచేస్తున్న డాక్టర్ నందకుమార్(28) మూడు నెలల క్రితం లక్షణాలు అనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. గుంటూరు ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కరోనా నుంచి కోలుకున్నారు.

కాగా ఇటీవలే తిరిగి విధుల్లో చేరారు. 15 రోజుల క్రితం మరోసారి ఆయనకు జ్వరం రాగా పరీక్ష చేయిస్తే మరోసారి కరోనా పాజిటివ్ గా తేలింది. ఇంటి వద్దనే చికిత్స తీసుకుంటున్నా ఎన్ని రోజులైనా లక్షణాల తీవ్రత తగ్గలేదు. దీంతో వైద్యులు సూచించిన మేరకు తిరుపతి స్విమ్స్ లో చేరారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే ఆరోగ్యం క్షీణించి కన్నుమూశారు. చిన్న వయసులోనే నందకుమార్ తనువు చాలించడంతో అతని కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న వ్యక్తి ఇలా కరోనాకు బలి కావడం పట్ల తోటి ఆసుపత్రి వైద్యులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

 

Related News