logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

ఎంపీ రఘురామకృష్ణంరాజుకు షాకిచ్చిన వైసీపీ..!

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు ఆ పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల వైసీపీ ఎమ్మెల్యేల పై రఘురామకృష్ణం రాజు పలు ఆరోపణలు చేసారు. తమ నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ప్రజాభిప్రాయాన్ని సీఎం జగన్ కు వివరించేందుకు తనకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని పలు టీవీ చర్చా కార్యక్రమాల్లో ఆరోపించారు.

అలాగే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలకు ఇసుక మాఫియాతో సంబంధాలు ఉన్నాయంటూ సొంత పార్టీ పైనే అయన చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. జగన్ ఫోటో పెట్టుకుని ఎన్నికల్లో గెలిచిన రఘురామకృష్ణంరాజు దమ్ముంటే పదవికి రాజీనామా చేయాలని వైసీపీ ఎమ్మెల్యేలు సవాల్ విసిరారు. అందుకు ఆయన సమాధానమిస్తూ తనను బతిమిలాడితేనే పార్టీలో చేరినట్టుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు ఎంపీ రఘురామకృష్ణంరాజు మధ్య మాటల యుద్ధం నెలకొంది.

వైసీపీ ఎమ్మెల్యేల నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పార్లిమెంట్ స్పీకర్ ఓం బిర్లాకు కూడా అయన ఓ లేఖను రాసిన సంగతి తెలిసిందే. గత పది రోజులుగా వైసీపీలో జరుగుతున్న ఈ పరిణామాలపై పార్టీ అధిష్టానం స్పందించింది. తాజాగా పార్టీ అధినాయకత్వం, ఎమ్మెల్యేలపై రఘురామకృష్ణం రాజు చేసిన విమర్శలకు వారంలోగా వివరణ ఇవ్వాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఈ నోటీసులను జారీ చేసారు.

Related News