logo

  BREAKING NEWS

తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |  

కరోనాతో వైసీపీ ఎమ్మెల్సీ మృతి!

కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వైరస్ తీవ్రత మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో రాజకీయ నేత కరోనా బారిన పడి మృతి చెందారు. వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణ రెడ్డి తుది శ్వాస విడిచారు. గత నెల 13వ తేదీన కరోనా బారిన పడిన ఆయనను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు.

అనంతరం ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. ఇటీవల అయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో శుక్రవారం చికిత్స పొందుతూ మరణించారు. కర్నూలుకు చెందిన చల్లా రామకృష్ణా రెడ్డి స్వతహాగా రైతు. వ్యవసాయరంగంలో ఆయన బాగా రాణించారు. ఆ తర్వాత జాతీయ కృషి పండిట్ అవార్డును కూడా అందుకున్నారు. 1983 లో రాజకీయాల్లో అడుగు పెట్టారు.

తెలుగు దేశం, కాంగ్రెస్ పార్టీలలో పనిచేసిన తర్వాత వైఎస్సార్సీపీలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కరోనా బారిన పడటంతో కొంతకాలంగా క్వారెంటైన్ ఉంటున్నారు. రెండు రోజుల క్రితమే ఆయన అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం విషమించడంతో ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంపై వైసీపీ శ్రేణులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Related News