కడప జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య హత్య కేసు సంచలనంగా మారింది. సుబ్బయ్య హత్య కేసులో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాదరెడ్డి అతని బావమరిది ప్రమేయం ఉందంటూ టీడీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. వారిద్దరి పేర్లను కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చాలంటూ నారా లోకేష్ ఆందోళనకు దిగారు.
ఈ నేపథ్యంలో ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే శివప్రసాద రెడ్డి మరోసారి స్పష్టం చేసారు. ఈ మేరకు చౌడేశ్వరి ఆలయంలో ఆయన ప్రమాణ చేసారు. గతంలో ఈ ఆరోపణలపై స్పందించిన శివప్రసాద్ రెడ్డి.. నందం సుబ్బయ్య 14 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని అన్నారు.
ఆయనకు ఎంతో మంది శత్రువులు ఉన్నారు. అతన్ని చంపాల్సిన అవసరం నాకేంటి? హింసను ప్రేరేపించే మనస్తత్వం నాది కాదు. సుబ్బయ్య హత్యకు అక్రమ సంబంధం కూడా కారణం అయ్యుండొచ్చు అన్నారు. తాజాగా ఈ కేసుతో తనకు సంబంధ లేదని చెబుతూ ఆయన అమ్మవారిపై ప్రమాణం చేసారు. కాగా గురువారం రోజున నందం సుబ్బయ్య అంత్యక్రియలు ప్రొద్దుటూరులో జరిగాయి.