logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

మాజీ మంత్రి, వైసీపీ ముఖ్య నేత కన్నుమూత..!

వైసీపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్య నేత కొప్పన మోహన్ రావు(75) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. కాగా బుధవారం చికిత్స పొందుతూ మోహన్ రావు తుదిశ్వాస విడిచారు. మోహన్ రావు వైసీపీలో కీలక నేతగా వ్యవహరించారు. 1978,1989లో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ తరపున పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో అటవీ శాఖా మంత్రిగా కూడా పనిచేసారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడటంతో కొంత కాలం క్రితమే వైసీపీలో చేరి పార్టీ తరపున సేవలందించారు. పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. కొప్పెన మోహన్ రావు మృతిపై పలువురు వైసీపీ నేతలు సంతాపం వ్యక్తం చేసారు.

Related News