logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

”అన్నయ్య రాజకీయాల్లోకి వస్తారని ఎదురుచూసి మోసపోకుమా!”.. వైసీపీ నేత కౌంటర్!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. త్వరలోనే చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారని జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు ఏపీలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ”అన్నయ్య రాజకీయాల్లోకి వస్తారని ఎదురుచూసి మోసపోకుమా! తమ్ముళ్ళతో సర్దుకుని సాగిపో సుమా!!” అంటూట్వీట్ చేశారు.

మరోవైపు కాపు సంఘం నాయకులతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారనే విషయం పై స్పష్టత లేదన్నారు. ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో నేను ఒకడిని. అయితే ఇప్పటికీ అన్నయ్య అభిప్రాయాలను గౌరవిస్తాను. అన్నయ్య జనసేన పార్టలో చేరతారా లేదా అనే విషయం ఆయన అభీష్టం మీదనే ఆధారపడి ఉంటుంది.

ఆయన పార్టీలోకి వస్తారా అనే విషయాన్నీ నేను ఇప్పుడే చెప్పలేను. ఒక సోదరుడిగా అన్నయ్య ఎప్పుడు నా శ్రేయాయస్సునే కోరుకుంటారు. అన్నయ్య నైతిక మద్దతు నాకెప్పుడూ ఉంటుంది. నాదెండ్ల మనోహర్ కూడా గతంలో ఇదే విషయాన్ని చెప్పారు. అంటూ వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్.

Related News