logo

  BREAKING NEWS

8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |  

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం..చుక్కలు చూపించిన ఓటర్లు! 

తెలంగాణలో గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు విపక్షాల మధ్య మాటల యుద్ధం వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యాయి. ఈ నేసథ్యంలో ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఓటర్లు చుక్కలు చూపించారు. మేడ్చల్ పరిధిలోని యాప్రాల్ లో స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రజలను ఓట్లు అడగటానికి వెళ్లారు.

దీంతో ప్రజలు ఆయనపై తిరగబడ్డారు. స్థానిక సమస్యలపై ఎమ్మెల్యేను నిలదీశారు. తమ ప్రాంతానికి రోడ్లు వేయకుంటే ఓట్లు వేసేది లేదని తెగేసి చెప్పారు. ‘నో రోడ్ నో వోట్’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ రెండు కిలో ఈటర్ల మేర ర్యాలీ చేసారు. అదే సమయంలో ఎన్నికల ప్రచారానికి ఎమ్మెల్యే మైనంపల్లి రావడంతో ప్రజలు ఆయనను అడ్డుకున్నారు. దీంతో మైనంపల్లి ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నంచేసారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచినవెంటనే రోడ్లు వేయిస్తానని హామీ ఇచ్చారు. లెటర్ ప్యాడ్ పై ఆయనతో సంతకం చేయించుకున్నారు. తన సొంత డబ్బుతో రోడ్లు వేయిస్తామని ఎమ్మెల్యే చెప్పడంతో తెలంగాణ ప్రభుత్వానికి విధిగా టాక్సులు కడుతున్నామని మీ డబ్బు మాకు అక్కరలేదని ప్రజలు ఖరాఖండీగా చెప్పారు. చివరకు స్థానికులతో ధర్నా విరమింపజేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Related News