ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమి భారతీయ యూజర్ల కోసం కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. షావోమి ఎంఐ 10ఐ పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇప్పటికే ఎంఐ 10 సిరీస్లో భాగంగా ఇప్పటికే ఎంఐ 10టీ, ఎంఐ 10 టీ ప్రో, ఎంఐ 10 5జీ ఫోన్లను తీసుకువచ్చింది ఈ సంస్థ. కాగా కొత్త సంవత్సరంలో షావోమి నుంచి వచ్చిన మొదటి ఫోన్ ఇది. ఈరోజు మధ్యాహ్నం వర్చువల్ కార్యక్రమం ద్వారా ఈ ఫోన్ ను లాంచ్ చేసింది. ఎంఐ 10ఐ పేరులో ‘ఐ’ అంటే ఇండియా అని, భారతీయ యూజర్ల అభిరుచి మేరకు దీనిని రూపొందించినట్టుగా పేర్కొంది. ఈ ఫోన్ లో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్ కెమెరా ఉండటం, దీని బరువు కేవలం 214.5 గ్రాములు మాత్రమే ఉండటం విశేషం.
ఫీచర్లు:
డిస్ ప్లే: 6. 67 అంగుళాలు
ప్రాసెసర్: క్వాల్కం స్నాప్ డ్రాగన్ 750జి
ఫ్రంట్ కెమెరా: 1+ మెగా పిక్సెల్స్
రియల్ కెమెరా: 108+8+2+2 మెగా పిక్సెల్స్
మూడు వేరియంట్లలో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. ఎంఐ 10 ప్రారంభ ధర రూ.20,999గా ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ. 2 వేల డిస్కౌంట్ లభిస్తుంది. ఎంఐ 10ఐ మూడు స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .20,999, కాగా 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ .21,999గా ఉండగా 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .23,999గా నిర్ణయించారు.