ఏదైనా స్మార్ట్ ఫోన్ హ్యాకింగ్ బారిన పడకుండా ఉండాలన్నా, ఇతర వైరస్ లు ఫోన్ పై దాడి చేయకుండా ఉండాలన్నా ఫోన్ లో సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేయడం అనేది తప్పనిసరి. అయితే షావోమి యూజర్లు మాత్రం సాఫ్ట్ వేర్ అప్ డేషన్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ విషయాన్ని షావోమి మొబైల్ యూజర్లు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు.
సాధారణంగా స్మార్ట్ ఫోన్లలో సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేసినప్పుడు ఆ ఫోన్లు మునుపటి కన్నా ఫాస్ట్ గా పనిచేయడం జరుగుతుంది. కానీ షావోమి ఏ 3 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 11 వాడుతున్నవారి ఫోన్లు తక్షణమే స్విచ్ ఆఫ్ అవుతున్నాయని వారు కంపెనీకి ఫిర్యాదు చేస్తున్నారు. మళ్ళీ తిరిగి ఆన్ అవ్వకపోవడంతో షావోమి యూజర్లు నుచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
అయితే ఈ ఫిర్యాదులపై సంస్థ స్పందించింది. యూజర్ల ఫిర్యాదులు తమ దృష్టికి కూడా వచ్చాయని వెంటనే తాము సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేయడం ఆపేశామని పేర్కొంది. ఇటీవల యూజర్లకు లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ ను అందించేందుకు ఆండ్రాయిడ్ 11 వెర్షన్ ను కంపెనీ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే తాము ఈ సమస్యపై పని చేస్తున్నామని అంత వరకు ఆండ్రాయిడ్ 11 డౌన్ లోడ్ చేసిన యూజర్లు ఎవరు సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేయవద్దని కోరింది సంస్థ.