logo

  BREAKING NEWS

క‌డుపులో మంట ఎందుకొస్తుంది ? ఎలా త‌గ్గించుకోవాలి ?  |   ఇక మీ గ‌డ‌ప వ‌ద్ద‌కే బ్యాంకు వ‌స్తుంది.. కొత్త స‌ర్వీసు  |   బ్రేకింగ్‌: తెలుగుదేశం పార్టీ పార్ల‌మెంటు అధ్య‌క్షుల నియామ‌కం  |   ఆ ఛాన‌ల్ ప్రోగ్రాంకు రాక‌పోయి ఉంటే ఎస్పీ మ‌న‌తోనే ఉండేవారా..?  |   బీజేపీ జాతీయ క‌మిటీ నియామ‌కం.. న‌లుగురు తెలుగువాళ్ల‌కు చోటు  |   టీడీపీ, వైసీపీ శ్రేణుల‌ను ఉర్రూత‌లూగించిన ఆ రెండు పాట‌లు పాడింది బాలునే  |   సొంతిల్లు దానం.. స‌మాధిపై ఏం రాయాలో ముందే చెప్పిన బాలు  |   శానిటైజ‌ర్ ఎక్కువ‌గా వాడుతున్నారా..? ఈ ప్ర‌మాదాలు ఉన్నాయి జాగ్ర‌త్త‌..!  |   విషాద వార్త‌… ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఇక లేరు  |   తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |  

గుడ్ న్యూస్‌: క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ వచ్చేసింది..!

యావ‌త్ ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తున్న క‌రోనా వైరస్‌కు విరుగుడు వ‌చ్చింది. కరోనా వైర‌స్ మొద‌టి వ్యాక్సిన్‌ను ర‌ష్యా విడుద‌ల చేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ త‌యారుచేసేందుకు గ‌త ఆరు నెల‌లుగా ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఈ ప‌రిశోధ‌న‌ల్లో ర‌ష్యా అంద‌రి కంటే ముందే వ్యాక్సిన్‌ను త‌యారు చేసి విజ‌య‌వంతంగా క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ పూర్తి చేసుకుంది. ముందుగా చెప్పిన‌ట్లే ఆగ‌స్టు 12 కంటే ముందు ఇవాళ ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ వైర‌స్‌ను విడుద‌ల చేశారు.

ర‌ష్యా అభివృద్ధి చేసిన క‌రోనా వ్యాక్సిన్‌ను రిజిస్ట‌ర్ చేశామ‌ని, ఈ వ్యాక్సిన్ ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటుంద‌ని పుతిన్ ప్ర‌కటించారు. వైర‌స్‌పై ఈ వ్యాక్సిన్ స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తోంద‌ని, వ్యాక్సిన్ తీసుకున్న వారిలో క‌రోనా వైర‌స్‌ను ఎదుర్కునే రోగ నిరోధ‌క శ‌క్తి ల‌భిస్తుంద‌ని ఆయ‌న తెలిపారు. త‌న కూతురిపై కూడా వ్యాక్సిన్ పరీక్షించ‌డం జ‌రిగింద‌ని, ఆమె ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంద‌ని ఆయ‌న తెలిపారు.

మొద‌టి విడ‌త‌లో భాగంగా ముందు త‌మ దేశంలో ప‌ని చేస్తున్న ఆరోగ్య సిబ్బందికి, వైర‌స్ ప్ర‌మాదం ఎక్కువ‌గా పొంచి ఉన్న వారికి అందివ్వ‌నున్న‌ట్లు పుతిన్ ప్ర‌క‌టించారు. అయితే, ర‌ష్యా త‌యారుచేసిన వ్యాక్సిన్‌పై ప‌లు అనుమానాలు కూడా కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు. వ్యాక్సిన్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ స‌రిగ్గా జ‌ర‌ప‌లేద‌ని ప‌లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ర‌ష్యా మాత్రం నిబంధ‌న‌ల ప్ర‌కారం అన్ని ట్ర‌య‌ల్స్ విజ‌య‌వంతం అయిన త‌ర్వాతనే వ్యాక్సిన్ విడుద‌ల చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది.

Related News