logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

క‌రోనా క‌ట్ట‌డికి నాలుగైదు సంవ‌త్స‌రాలు ప‌ట్టొచ్చు

ఒక‌వైపు క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ త‌యారీ వేగంగా జ‌రుగుతుంద‌నే వార్త‌ల‌తో ఊర‌ట చెందుతున్న వారికి ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌(డ‌బ్లూహెచ్ఓ) శాస్త్ర‌వేత్త‌ల వాద‌న ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చినా క‌రోనా వైర‌స్ పూర్తిగా వెళ్లిపోవాలంటే ఇంకో నాలుగైదు సంవ‌త్స‌రాలు ప‌ట్ట‌వ‌చ్చ‌ని డ‌బ్లూహెచ్ఓ శాస్త్ర‌వేత్త సౌమ్య విశ్వ‌నాథ‌న్ ఓ ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నారు. ఒక‌వేళ వ్యాక్సిన్ వ‌చ్చినా సైడ్ ఎఫెక్ట్స్‌, ఉత్ప‌త్తి, ధ‌ర‌, ర‌వాణా వంటి అనేక విష‌యాల‌ను ప‌రిగ‌ణలోకి తీసుకోవాల్సి ఉంటుంద‌ని, కాబ‌ట్టి క‌రోనాను పూర్తిగా నివారించ‌డానికి నాలుగైదు సంవ‌త్స‌రాలు ప‌ట్ట‌వ‌చ్చ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

ఇక‌, క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేయ‌డానికి లాక్‌డౌన్ ఒక్క‌టే సరిపోద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. కాక‌పోతే వైర‌స్ వ్యాప్తిని త‌గ్గించ‌డానికి మాత్ర‌మే లాక్‌డౌన్ ప‌ని చేస్తోంద‌ని అంటోంది. క‌రోనా వైర‌స్‌ను ఎదుర్కునే రోగ నిరోధ‌క శ‌క్తి 60 – 70 శాతం ప్ర‌జ‌ల్లో ఏర్ప‌డాల‌ని డ‌బ్లూహెచ్ఓ ప్ర‌తినిధులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. వ్యాక్సిన్ వేగంగా త‌యారు కావ‌డ‌మే ఇప్పుడు మ‌న ముందున్న మార్గ‌మ‌ని పేర్కొంటున్నారు. కాగా, అంత‌ర్జాతీయంగా మాడ‌ర్న‌, స‌నోఫి, నోవావాక్స్ వంటి సంస్థ‌లు వ్యాక్సీన్ త‌యారీ ప‌రిశోధ‌న‌లు వేగంగా జ‌రుపుతున్నాయి. త్వ‌ర‌లోనే మ‌నుషుల‌పై ప్ర‌యోగాలు ప్రారంభించ‌నున్నాయి.

Related News