logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

యువతి శీలానికి వెలకట్టి.. పంచుకున్న గ్రామ పెద్దలు

వరంగల్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. రాయపర్తి మండలంలోని తండాకు చెందిన ఓ యువతిపై స్థానికంగా నివసించే ఓ యువకుడు అత్యాచారానికి యత్నించాడు. అతనినుండి తప్పించుకుని వచ్చిన యువతి ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేసింది. వారి ద్వారా ఈ విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు రంగంలోకి దిగారు.

నిందితుడిని కేసు నుండి తప్పించే ప్రయత్నం చేయడమే గాక యువతి శీలానికి రూ. 2 లక్షలు విలువ కట్టారు. విషయాన్ని పోలీసుల వరకు వెళ్లకుండా రెండు లక్షలు చెల్లించాలని తీర్పు చెప్పారు. పోనీ ఆ సాయమైన బాధితురాలికి అందించారా అంటే నిందితుడు చెల్లించిన రెండు లక్షల రూపాయలను గ్రామ పెద్దలే వాటాలు వేసుకుని పంచుకున్నారు. ఈ విషయంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువతీ శీలానికి వెలకడుతూ పంచాయితీ పెద్దలు చెప్పిన తీర్పుపై గ్రామస్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. నిందితుడిని పోలీసులకు అప్పగించి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Related News