logo

  BREAKING NEWS

తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |   జ‌గ‌న్‌ను ఓడించే కుట్ర‌..? కొడాలి నాని పాత్ర‌..?  |   బ్రేకింగ్‌: జ‌గ‌న్ ఇంటి ముట్ట‌డి.. హైద‌రాబాద్‌, తిరుప‌తిలో ఉద్రిక్త‌త‌‌  |   బ్రేకింగ్: డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో మ‌హేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌త పేరు  |   అమెరికా నుంచి ఎలా వ‌చ్చింది..? ‘కాంగ్రెస్ గ‌డ్డి’ అని ఎందుకు పిలుస్తారు ?  |   తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్య‌క్షుడి పేరు ఖ‌రారు  |   ఇక నుంచి ‘యాదాద్రి’ రైల్వే స్టేష‌న్‌  |   హ‌రీష్ రావు వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్‌రావు  |   ఈ చిన్న ప‌ని చేస్తే 15 నిమిషాల్లో త‌ల‌నొప్పి మాయం  |   రూ.15,000 లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే  |  

కొడుకు వ‌రుస‌య్యే వ్య‌క్తితో అక్ర‌మ సంబంధం.. భ‌ర్త హ‌త్య‌

కామంతో క‌ళ్లు మూసుకుపోయిన ఓ మ‌హిళ విలువ‌ల‌ను వ‌దిలేసింది. క్ష‌ణ‌కాలం సుఖం కోసం వైవాహిక జీవితంలో నిప్పులు పోసుకుంది. కుమారుడి వ‌ర‌స‌య్యే వ్య‌క్తితో వివాహేతర సంబందం పెట్టుకొని క‌ట్టుకున్న భ‌ర్త‌ను క‌డ‌తేర్చింది. ఈ దారుణ సంఘ‌ట‌న తూర్పు గోదావ‌రి జిల్లాలో జ‌రిగింది. వివ‌రాళ్లోకి వెళితే.. తూర్పు గోదావ‌రి జిల్లా ప్రత్తిపాడు మండలం చింతలూరులో జంకల అప్పారావు అలియాస్‌ వరహాలు(35), ఆయ‌న భార్య మ‌ధ్య గ‌త కొంత‌కాలంగా గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి.

భార్య వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తుంద‌ని తెలుసుకున్న వ‌ర‌హాలు భార్య‌ను ప‌ద్ధ‌తి మార్చుకోవాల‌ని హెచ్చ‌రిస్తున్నాడు. ఆమె వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న‌ది కుమారుడి వ‌రుస‌య్యే వ్య‌క్తితో కావ‌డంతో వ‌ర‌హాలు తీవ్ర మాన‌సిక వేదన‌కు గుర‌వుతున్నాడు. ఈ క్ర‌మంలో గ‌త కొన్ని రోజులుగా భార్య‌ను గ‌ట్టిగా మంద‌లిస్తున్నాడు. ప‌ద్ధ‌తి మార్చుకొని అప్పారావు భార్య ఆయ‌న‌నే అడ్డుతొల‌గించుకోవాల‌ని ప‌థ‌కం ప‌న్నింది. భ‌ర్త మ‌ర‌ణిస్తే త‌నకు అడ్డు ఎవ‌రూ ఉండ‌ర‌ని స్కెచ్ వేసింది.

భ‌ర్తను చంపాల‌ని నిందితురాలు, ఆమె ప్రియుడు క‌లిసి ప‌థ‌కం ర‌చించారు. బుధ‌వారం రాత్రి అప్పారావు త‌న ఇంట్లో గాఢ నిద్ర‌లో ఉన్న‌ప్పుడు ఆమె ప్రియుడికి స‌మాచారం ఇచ్చింది. ప్రియుడు, ఆమె క‌లిసి అప్పారావుపై క‌ర్ర‌లు, క‌త్తితో విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేసి హ‌త‌మార్చారు. ఈ ఘ‌ట‌న స్థానికంగా సంచ‌ల‌నం సృష్టించింది. పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.

Related News