logo

  BREAKING NEWS

తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |  

ప్రసవం కోసం పుట్టింటికి వచ్చి.. మాజీ ప్రియుడితో సంబంధం.. భర్త హత్య!

ప్రసవానికి పుట్టింటింకి వచ్చిన ఓ ఇల్లాలు ఓ బిడ్డకు జన్మనించ్చింది. ఈ క్రమంలో ఆమెకు పుట్టింట్లో తన మాజీ ప్రియుడు కంటపడ్డాడు. దీంతో ఆమె మనసు ప్రియుడిపైకి మళ్లింది. ఇద్దరు కలిసి అక్రమ సంబంధాన్ని కొనసాగించారు. ఆ సంబంధినైకి అడ్డుగా ఉన్నాడని భావించి కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి హతమార్చింది.

భార్య, కొడుకుని చూడటానికి వచ్చిన వ్యక్తి వారి చేతిలోనే దారుణ హత్యకు గురైన ఘటన కర్ణాటక జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ధార్వాడ జిల్లా హుబ్లీ తాలూకాకు చెందిన అక్షిత అనే మహిళకు ఏడాదిన్నర క్రితం హవేరి ప్రాంతానికి చెందిన జగదీశ్ తో వివాహమైంది.

అంతకు ముందు నుంచే ఆమెకు తన ఇంటి పక్కన ఉండే కాశప్ప అనే యువకుడితో సంబంధం ఏర్పడింది. అక్షిత వేరే వ్యక్తికి పెళ్లి చేసుకోవడంతో కాశప్ప కూడా మరో యువతని ఐదు నెలల క్రితమే పెళ్లి చేసుకున్నాడు. ఇంతలో అక్షిత గర్భం దాల్చడంతో కొన్ని నెలల క్రితం ప్రసవం కోసం పుట్టింటికి వచ్చింది.

నాలుగు నెలల క్రితం ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయంలో ఆమెకు తన మాజీ ప్రియుడు కాశప్ప కలిశాడు. దీంతో వీరిద్దరూ మళ్ళీ అక్రమ సంబంధాన్ని కొనసాగించారు. అయితే తన కొడుకుని చూసుకోవడానికాని జగదీశ్ అక్షిత పుట్టింటికి వచ్చాడు. తన సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన అక్షిత ప్రియుడితో కలిసి పథకం వేసింది.

ఈ క్రమంలో కాశప్ప జగదీష్ ను మద్యం తాగడానికని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత అతని తలపై బండరాయితో మోది హత్య చేసాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

Related News