logo

  BREAKING NEWS

ముగిసిన 5 గంటల డెడ్ లైన్.. ఎస్ఈసీకి అధికారుల షాక్!  |   కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి ముహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన!  |   అయోధ్య రామ‌మందిరానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ విరాళం  |    గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం తెలుస్తారో?  |   చికెన్‌, కోడిగుడ్లు ఇలా తింటే డేంజ‌ర్‌.. fssai జాగ్ర‌త్త‌లు  |   తిరుపతి ఉపఎన్నిక పోరులో జనసేన అభ్యర్థి.. పవన్ క్లారిటీ!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇక వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు  |   పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల షాక్!  |   ‘కాబోయే సీఎం కంగ్రాట్స్’ వేదికపైనే షాకిచ్చిన మంత్రి.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |  

సైనేడ్ తో భర్తను చంపిన ఇల్లాలు..

గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడి మోజులో పడి ఓ ఇల్లాలు కట్టుకున్న భర్తనే కడతేర్చింది. అందుకోసం నిందితుడికి రూ. 10 లక్షల సుపారీ ఇచ్చింది. పోలీసులు రంగంలోకి దిగడంతో ఆ ఇల్లాలి ప్లాన్ వికటించింది. మృతుడి భార్య కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకుని అరెస్టు చేసారు.

వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా పెదకూరపాడుకు చెందిన బ్రహ్మయ్య(42)ను ఇటీవల ఇద్దరు యువకులు దారిలో అడ్డగించి అతనిపై గుర్తుతెలియని రసాయనాలను చల్లారు. వారి నుంచి తపించుకున్న బ్రహ్మయ్య స్థానికంగా ఉండే బంధువుల ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే ఆ రసాయనాల ప్రభావంతో బ్రహ్మయ్య మార్గమధ్యంలోనే మృతి చెందాడు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతుడి భార్య సాయి కుమారి పై అనుమానం వ్యక్తం చేసారు. ఆమె కాల్ డేటాను పరిశీలించగా భర్త మరణానికి ముందు ఆమె ఫోన్ నుంచి అదే గ్రామానికి చెందిన అశోక్ రెడ్డి అనే యువకుడికి ఫోన్ వెళ్ళింది. దీంతో అశోక్ రెడ్డితో సాయికుమారి వివాహేతర సంబంధాన్ని బయటపెట్టారు.

ప్రియుడి తో కలిసి సాయికుమారి భర్త హత్యకు పథకం వేసింది. అందులో భాగంగా మచిలీపట్నానికి చెందిన పవన్ కుమార్, షేక్ ఆరీఫ్ లను రప్పించారు. వారికి రూ. 10 లక్షల సుపారీ మాట్లాడారు. దీంతో వారు రోల్డుగోల్డు నగల తయారీలో వాడే సైనేడ్ ను బిస్కట్ లో కలిపి కుక్కకు తినిపించారు. ఆ కుక్క మృతి చెందినట్టుగా నిర్దారించుకున్న తర్వాత అదే రోజు రాత్రి సైనేడ్ ను బ్రహ్మయ్య ముఖం పై చల్లి వెళ్లిపోయారు. ఈ హత్యలో పాలుపంచుకున్న నిందితులందరినీ శనివారం పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

Related News