logo

  BREAKING NEWS

గుడ్ న్యూస్‌: క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ వచ్చేసింది..!  |   వైఎస్సార్‌, చంద్ర‌బాబు స్నేహ‌బంధంపై సినిమా  |   క‌రోనా ఖతం అయ్యే డేట్ చెప్పిన బిల్ గేట్స్‌  |   నిజంగానే పాపం త‌గిలిన‌ట్లుంది… క‌రోనాతో ఆ ఎస్సై మృతి  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వల్ల కూడా ఆ ప‌ని కాదు.. కొడాని నాని హాట్ కామెంట్స్‌  |   బ్రేకింగ్‌: మాజీ రాష్ట్ర‌ప‌తికి క‌రోనా పాజిటీవ్‌  |   క‌న్న‌డ దంప‌తుల ధైర్యం… పీఓకేలోని శార‌దాపీఠం నుంచి అయోధ్య‌కు ప‌విత్ర మ‌ట్టి  |   పాక్ నుంచి వ‌చ్చిన ఒకే కుటుంబంలో 11 మంది ఆత్మ‌హ‌త్య‌  |   విజ‌య‌వాడ కోవిడ్ సెంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదానికి కార‌ణాలివే..!  |   ప్లాస్మా దానం అంటే ఏమిటి ? ఎవ‌రు చేయాలి ? ఎలా చేయాలి ?  |  

కరోనా బాధితురాలి పట్ల కుటుంబ సభ్యుల అమానుషం.. ఆత్మహత్య!

కరోనా వైరస్ మానవత్వాన్ని మంటగలుపుతున్న ఘటనలు చూస్తూనే వున్నాం. తాజాగా ఏపీలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వాసుపత్రి భవనం పై నుంచి దూకి కరోనా బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది. చల్లపల్లి మండలం నారాయణపురానికి చెందిన అది లక్ష్మి కరోనా వైరస్ భారిన పడిందది. ఆమెను విజయవాడలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చి కుటుంబ సభ్యులు చికిత్స చేయించారు.

ఇటీవల ఆది లక్ష్మి కోలుకుంది. కరోనా పరీక్షలు జరుపగా కరోనా నెగిటివ్ అని తేలింది. వైద్యులు ఆమెను డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వెళ్లవచ్చని కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే అది లక్ష్మిని తిరిగి ఇంటికి తీసుకుని వెళ్ళడానికి ఆమె కుటుంబం నిరాకరించింది. తమకు కూడా కరోనా వస్తుందేమోనని భయపడ్డారు. కరోనా నుంచి బాధితురాలు పూర్తిగా కోలుకుందని తెలిపినా ఆ కుటుంబం బాధితురాలి పట్ల నిర్దయగా వ్యవహరించింది. ఊహించని ఈ పరిణామంతో ఆది లక్ష్మి తీవ్ర మనస్తాపానికి గురైంది. కుటుంబ సభ్యులే తనను కాదనుకోవడంతో ఆసుపత్రి భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related News